మైగ్రేన్‌ తలనొప్పిని ఎన్నాళ్లు భరిస్తారు?

ABN , First Publish Date - 2022-12-06T12:58:59+05:30 IST

తలనొప్పి మాట సాధారణంగా వింటూనే ఉంటాం. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు తలనొప్పితో బాధపడే ఉంటారు. అయితే మైగ్రేన్‌ తలనొప్పి ఉన్న వారి బాధలు వర్ణనాతీతం. మూడు

మైగ్రేన్‌ తలనొప్పిని ఎన్నాళ్లు భరిస్తారు?
తలనొప్పిని ఎన్నాళ్లు భరిస్తారు?

తలనొప్పి మాట సాధారణంగా వింటూనే ఉంటాం. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు తలనొప్పితో బాధపడే ఉంటారు. అయితే మైగ్రేన్‌ తలనొప్పి ఉన్న వారి బాధలు వర్ణనాతీతం. మూడు నాలుగు రోజుల పాటు బెడ్‌రూమ్‌ నుంచి బయటకు రాలేరు. ఎన్నిమాత్రలు వేసిన ప్రయోజనం శూన్యం. మైగ్రేన్‌ తలనొప్పి కొన్న గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుంది. వికారం వాంతి వంటి లక్షణాలుంటాయి. శబ్ధాన్ని, కాంతిని భరించలేరు. ఘాటైన వాసనను భరించలేరు. మెదడులోని రక్తనాళాలు, నరాలు ప్రేరేపితమై వాటి నుంచి వెలువడే కొన్ని రసాయన పదార్థాల వల్ల తలనొప్పి వస్తుంది.

మైగ్రేన్‌ ట్రిగ్గర్స్‌

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. తలనొప్పితో బాదపడుతున్న 85 శాతం మందిలో ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ రావడం చూస్తుంటాం. సరియైున సమయానికి భోజనం చేయకపోయినా, నిద్ర తక్కువైనా, ఎండలో తిరిగినా, ఎక్కువ చలికి ఎక్స్‌పోజ్‌ అయినా, బాగా అలసిపోయినా, పగలు ప్రయాణం చేసినా ఈ మైగ్రేన్‌ వస్తుంది. చాక్‌లెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌, రెడ్‌వైన్‌ లాంటివి మైగ్రేన్‌ తలనొప్పిని అధికం చేస్తాయి. స్ర్తీలకు బహిష్టు సమయంలో మైగ్రేన్‌ తలనొప్పి ఎక్కువ కావచ్చు. కాని చాలా మందికి స్ర్తీలకు గర్భం ధరించినపుడు మైగ్రేన్‌ తగ్గుతుంది. మెదడుకు సంబంధించిన సమస్యలు మెనింజైటిస్‌, ఎన్‌ఖెఫలైటిస్‌ వంటి వ్యాధులతో కూడా తలనొప్పి వస్తుంది.

-డాక్టర్‌ రవి కిరణ్‌

MD,M.Sc (Psych),P.G (Virology)LONDON

గోల్డ్‌ మెడల్‌ ఫర్‌ ఎక్సెలెన్సీ ఇన్‌ మెడిసన్‌,

మాస్టర్స్‌ హోమియోపతి.

ఆదిలాబాద్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్‌, విజయవాడ, కరీంనగర్‌, విశాఖపట్నం, తిరుపతి, హన్మకొండ, రాజమండ్రి, గుంటూరు.

ఫోన్‌ నెంబరు: 7842108108, 040- 48106108

Updated Date - 2022-12-06T12:59:00+05:30 IST