మోకాళ్ల నొప్పులకు... ఆ‘పరేషాన్‌’ ఒక్కటే మార్గమా?

ABN , First Publish Date - 2022-09-06T15:21:41+05:30 IST

దీర్ఘకాలిక మోకాలి నొప్పులతో బాధపడేవారికి మోకాలి మార్పిడి ఆపరేషన్‌ అవసరం లేదు. ఆపరేషన్‌ అవసరం లేకుండానే

మోకాళ్ల నొప్పులకు... ఆ‘పరేషాన్‌’ ఒక్కటే మార్గమా?

దీర్ఘకాలిక మోకాలి నొప్పులతో బాధపడేవారికి మోకాలి మార్పిడి ఆపరేషన్‌ అవసరం లేదు. ఆపరేషన్‌ అవసరం లేకుండానే మోకాలి నొప్పిని తగ్గించే చికిత్స ఇండో బ్రిటిష్‌ అడ్వాన్స్‌డ్‌ పెయిన్‌ క్లినిక్‌లో అందుబాటులో ఉంది. అరవై ఏళ్లలో తలెత్తే మోకాలి నొప్పులు నేడు 40 ఏళ్లకే వేధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో మోకాలి నొప్పులకు ఆరోగ్యంపై శ్రద్ధ కొరవడడం, క్యాల్షియం లోపం, వ్యాయామం కొరవడడం ప్రధాన కారణాలు. చిన్న వయసులోనే కీళ్ల వాతానికి గురవడం, హైపోథైరాయిడిజం వల్ల మోకాళ్లు త్వరగా అరిగిపోతూ ఉంటాయి. అలాగే స్థూలకాయం కూడా ఇందుకు కారణమే! 


రీజనరేటివ్‌ థెరపీ

ఏ కారణం వల్ల మోకాలి నొప్పులు మొదలైనా ఆపరేషన్‌తో పని లేకుండా ఈ నొప్పులను అధిగమించే ఇతర మార్గాలున్నాయి. వాటిలో మొదటిది దెబ్బతిన్న మోకాలిని బాగు చేసే రీజనరేటివ్‌ థెరపీ. ఈ చికిత్సలో భాగంగా మృదులాస్థిని పునరుత్పత్తి చేసే గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌ను రక్తం నుంచి వేరు చేసి, వాటిని సమస్య ఉన్న కీళ్లలో ఇంజెక్ట్‌ చేయడం జరుగుతుంది. వీటిలో ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ(పి.ఆర్‌.పి), గ్రోత్‌ ఫ్యాక్టర్‌ కాన్‌సెంట్రేట్స్‌(జి.ఎ్‌ఫ.సి), స్టెమ్‌ సెల్స్‌ ప్రధానమైనవి. ఈ ప్రక్రియలో రోగి రక్తాన్ని సేకరించి, దాన్లోని ప్లాస్మా నుంచి ప్లేట్‌లెట్స్‌, గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌ వేరు చేసి, మోకీళ్లలో ప్రవేశ పెడతారు. కొందరికి ఎముక మూలుగలోని స్టెమ్స్‌ సెల్స్‌ అవసరమవుతాయి. దీంతో కొత్త కణజాలాన్ని ఉత్పత్తి చేసే కారకాలు ప్రేరేపితమై మృదులాస్థి పునరుత్పత్తి సాధ్యపడుతుంది. చికిత్స పూర్తయిన తర్వాత నొప్పి తగ్గుతుంది. కొందర్లో మోకాలి కీళ్ల రాపిడి వల్ల, సైనోవియల్‌ ఫ్లూయిడ్‌ అనే జిగురు తగ్గడం వల్ల నొప్పి ఉంటుంది. ఈ జిగురును తిరిగి ఉత్పత్తి చేయగలిగితే నొప్పి తగ్గుతుంది. 


కూల్డ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌

ఈ థెరపీ, అరిగిపోయిన మోకాలి నొప్పిని గ్రహించేలా చేసే నాడులే లక్ష్యంగా సాగుతుంది. చికిత్సలో భాగంగా ప్రత్యేక సూది ద్వారా నాడుల స్పందనను నిర్వీర్యం చేసి, మెదడుకు నొప్పి తాలూకు సంకేతాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఈ చికిత్సతో రోగులు సత్వర ఉపశమనం పొంది, వారి జీవన నాణ్యత పెరుగుతుంది. చికిత్స ఇంజెక్షన్‌ ద్వారా జరుగుతుంది. కాబట్టి నొప్పి, రక్తస్రావం, దుష్ప్రభావాలు ఉండవు. బెడ్‌రెస్ట్‌ కూడా అవసరం లేదు. దైనందిన కార్యకలాపాలు వెంటనే మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి, సమస్య తీవ్రత, వయసు, ఆరోగ్య పరస్థితుల ఆధారంగా చికిత్సను తీసుకోవాలి. 


గవర్నర్‌ ప్రశంశలు

ముంబయిలోని రాజ్‌భవన్‌లో ప్రజా డైరీ తెలుగు మ్యాగజైన్‌ 23వ వార్షికోత్సవం సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్‌ భగత్సంగ్‌ ఖుషియారి నుంచి డాక్టర్‌ విజయ భాస్కర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. జబ్బులన్నింటికీ సర్జరీ పరిష్కారం కాదనీ, వాటికి ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను అనుసరిస్తున్న ప్రముఖ నొప్పుల చికిత్సా వైద్యుడు డాక్టర్‌ విజయభాస్కర్‌ బండికట్ల అభినందనీయులని మహారాష్ట్ర గవర్నర్‌ భగత్సంగ్‌ ఖుషియారి ప్రశంసించారు. 


-డాక్టర్‌ విజయభాస్కర్‌ బండికట్ల, MBBS, FFPMRCA(పెయిన్ మెడిసిన్,  RCOA UK) CCT(అనస్థీషియాలజీ అండ్‌ పెయిన్‌ మ్యానేజ్‌మెంట్‌), న్యూరోమాడ్యులేషన్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ పెయిన్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (లండన్‌)



Updated Date - 2022-09-06T15:21:41+05:30 IST