Food Fact: కమలాపండు... లాభాలు మెండు

ABN , First Publish Date - 2022-11-30T15:13:40+05:30 IST

కమలాపండులో ఆరోగ్యాన్ని నిక్షేపంగా ఉంచే విలువైన పోషకాలుంటాయి. కాబట్టి స్నాక్‌గా కమలాపండ్లను తింటూ ఉండాలి.

Food Fact: కమలాపండు... లాభాలు మెండు
లాభాలు మెండు

కమలాపండులో ఆరోగ్యాన్ని నిక్షేపంగా ఉంచే విలువైన పోషకాలుంటాయి. కాబట్టి స్నాక్‌గా కమలాపండ్లను తింటూ ఉండాలి.

  • గుండెకు మేలు - వీటిలోని హెర్పెరెడిన్‌ అనే ఎంజైమ్‌ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. దీన్లోని ఫోలేట్‌ గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

  • జీర్ణాశయం సురక్షితం - ఈ పండ్లలోని విటమిన్‌ సి అల్సర్లు రాకుండా కాపాడుతుంది. పీచు, పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది.

  • మూత్రపిండాలకు మేలు - వ్యర్థాలను వడగట్టడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షణ కల్పిస్తుంది.

  • క్యాన్సర్‌ నుంచి రక్ష - సిట్రస్‌ జాతి పళ్లు తినే వాళ్లకు క్యాన్సర్‌ వచ్చే అవకాశం 40 నుంచి 45% తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది.

  • రోగనిరోధక శక్తి - ఎక్కువ విటమిన్‌ సి శరీరంలో ఉంటే బ్యాక్టీరియా, వైరస్‌లు దరిచేరనివ్వదు. ఫలితంగా జలుబులు, జ్వరాలు దరిచేరవు.

  • ఆరోగ్యవంతమైన చర్మం - కమలా పండ్లలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

  • కళ్లకు మంచిది - వీటిలోని కెరోటినాయిడ్స్‌ నైట్‌ బ్లైండెడ్‌నెస్‌, మస్క్యులర్‌ డిజనరేషన్‌ సమస్యల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తాయి.

Updated Date - 2022-11-30T15:13:41+05:30 IST