ఐవిఎఫ్‌...పదే పదే ఫెయిల్‌ అవుతుంటే?

ABN , First Publish Date - 2022-09-15T21:32:35+05:30 IST

డాక్టర్‌... మేం ఇప్పటివరకూ పలుసార్లు ఐ.వి.ఎఫ్‌. ప్రయత్నించాం. ఆయన స్పెర్మ్‌ కౌంట్‌ సరిగానే ఉన్నా, పదే పదే ఐ.వి.ఎఫ్‌.

ఐవిఎఫ్‌...పదే పదే ఫెయిల్‌ అవుతుంటే?

డాక్టర్‌... మేం ఇప్పటివరకూ పలుసార్లు ఐ.వి.ఎఫ్‌. ప్రయత్నించాం. ఆయన స్పెర్మ్‌ కౌంట్‌ సరిగానే ఉన్నా, పదే పదే ఐ.వి.ఎఫ్‌. ఎందుకు ఫెయిల్‌ అవుతోంది? కారణం ఏమై ఉంటుంది? 


మహిళలో అండాలు, పురుషుడిలో స్పెర్మ్‌ బాగానే ఉన్నా, ఐ.వి.ఎఫ్‌. ఫెయిల్‌ అవుతూ ఉండడానికి కారణం స్పెర్మ్‌ డిఎన్‌ఎలో సమస్య అయి ఉండవచ్చు. ఐ.వి.ఎఫ్‌కు ముందు తప్పనిసరిగా స్పెర్మ్‌ డిఎన్‌ఎ పరీక్ష చేయించాలి. లోపాలు ఉంటే, మందులు వాడి, సరిదిద్దుకున్న తర్వాతే ఐ.వి.ఎఫ్‌కు వెళ్లడం మంచిది. లేదంటే లక్షలు ఖర్చుపెట్టి చేయించుకునే ఐ.వి.ఎఫ్‌. ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. కేవలం 7 వేల ఖరీదు చేసే ఈ పరీక్ష కోసం వెనకాడడం సరికాదు. సాధారణంగా పురుషులకు చేసే స్పెర్మ్‌ టెస్ట్‌లో వీర్య కణాల ఆకారం, కదలికలు, సంఖ్య వివరాలు మాత్రమే తెలుస్తాయి. అవన్నీ బాగానే ఉన్నా... వీర్యకణాల డిఎన్‌ఎలో లోపం ఉండే వీలుంది. దీన్ని కనిపెట్టి సరి చేయకుండా ఐ.వి.ఎఫ్‌ చేయించు కుంటే గర్భధారణ జరిగినా అబార్షన్‌ అవడం, లేదా గర్భమే దాల్చకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎ పరీక్షలో డి.ఎన్‌.ఎ సమస్యతో కూడిన వీర్య కణాలు 30ు కంటే ఎక్కువ ఉంటే ఫెర్టిలిటీ జరగదు. కాబట్టి డి.ఎన్‌.ఎ పరీక్ష చేసి, సమస్య ఉంటే సరిదిద్దుకోవాలి. ఈ విషయాన్ని ఫెర్టిలిటీ క్లినిక్‌లు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాయి. చికిత్సతో సమస్య సరిదిద్దుకోవడానికి పట్టే రెండు నెలల వ్యవధిలో కస్టమర్‌ చేయి జారిపోతాడేమో అనే భయమే ఇందుకు కారణం. ఏదేమైనప్పటికీ ఐ.వి.ఫ్‌కు ముందు స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎ. పరీక్ష చేయించడం అత్యవసరం.


-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌,

ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

Updated Date - 2022-09-15T21:32:35+05:30 IST