చవకగా లభించే ఈ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

ABN , First Publish Date - 2022-01-19T16:47:49+05:30 IST

దానిమ్మ పండులో పోషకాలు పుష్కలం. చవకగా లభించే దానిమ్మ పండు అందరూ తినదగినది.

చవకగా లభించే ఈ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

ఆంధ్రజ్యోతి(19-01-2021)

దానిమ్మ పండులో పోషకాలు పుష్కలం. చవకగా లభించే దానిమ్మ పండు అందరూ తినదగినది. 


 దానిమ్మ గింజలు తింటే రక్తవృద్ధి కలుగుతుంది. దీంతోపాటు రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. హైబీపీ ఉండదు. గుండెకు మేలు   చేస్తుంది.

 నొప్పుల నివారిణి. దీంతో పాటు ఈ పండు తింటే చర్మం మృదువుగా తయారవుతుంది.

 డయాబెటీస్‌ ఉండే వారు ఈ పండును తినటం మంచిది. జీర్ణశక్తిని పెంచుతుంది.

 జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది.

 వీటిని తింటే ఎముకల్లో గట్టిదనం వస్తుంది.

 దానిమ్మలో విటమిన్‌ సి, పొటాషియం ఉంటుంది. నిద్రలేచిన వెంటనే ఉండే సిక్‌నెస్‌ తొలగిపోతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

 సాధారణంగా జ్యూస్‌ చేసుకుని తాగడం కంటే దానిమ్మ పండును తినటమే ఆరోగ్యమని వైద్యులు సూచిస్తున్నారు.

 కడుపులో ఉండే ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.

 నోటిలోని బ్యాక్టీరియాల్ని చంపేస్తుంది. నోటి పూత, చిగుళ్ల రక్తస్రావంను తగ్గిస్తుంది. 

 దానిమ్మ రసాన్ని చర్మం మీద ఉండే పొక్కులపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

 దానిమ్మ బెరడు, తోలు, ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివే. 

Read more