Pistachio health benefits: పిస్తా ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసా..!

ABN , First Publish Date - 2022-12-01T15:02:29+05:30 IST

ఇవి బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి.

Pistachio health benefits: పిస్తా ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసా..!
health benefits

పిస్తా పప్పులు చాలా రుచికరమైనవి అలాగే ఆరోగ్యకరమైనవి కూడా. ఈ పిస్తాలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి అనేక కీలకమైన పోషకాలను కలిగి ఉంటాయి ఇవి బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. 7000 BC నుండి పిస్తాపప్పులను మన ఆరోరంలో వాడుతున్నామట. వీటిని ఎక్కువగా ఐస్ క్రీం, స్వీట్‌లతో సహా అనేక ఆహారాలలో వాడుతున్నాం.

health-benefits.jpg

పిస్తాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

1. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది.

పిస్తాపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ గట్‌లోని బ్యాక్టీరియాకు అద్భుతమైనది. దీనిలో ఉండే బి 6 ప్రోటీన్లు, పిస్తాలో కేలరీలు ఎక్కువ.

2. రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పిస్తాపప్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి కారణం వాటిలోని ఎల్-అర్జినైన్ భాగం, ఇది నైట్రిక్ ఆక్సైడ్‌గా మారినప్పుడు రక్తప్రసరణకు సహాయపడుతుంది.

3. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. పిస్తాలు ముఖ్యంగా అధికబరువుతో బాధపడేవారికి మేలు చేస్తాయి. పిస్తా లో పోషక పదార్థం ఎక్కువ . పొటాసియం అత్యధికం గా లబిస్తుంది.

4. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గింజల్లో పిస్తా ఒకటి. కంటి ఆరోగ్యానికి తోడ్పడే రెండు పోషకాలైన లుటీన్, జియాక్సంతిన్ లు అధిక స్థాయిలో ఇందులో ఉంటాయి. శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది.

5. పోషకాలు పూర్తి..

ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అనే పోషకాలు పిస్తాలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, విటమిన్ B6 ఖనిజాలతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Updated Date - 2022-12-01T15:06:25+05:30 IST