Family planning: ‘కాపర్‌ టి’ వేయించుకోవచ్చా?

ABN , First Publish Date - 2022-11-24T13:07:32+05:30 IST

నాకు నాలుగు నెలల పాప ఉంది. కుటుంబ నియంత్రణ కోసం మా చెల్లెలు ‘కాపర్‌ టి’ వేయించుకోమంటోంది. అసలు కాపర్‌ టి అంటే ఏమిటి? అదెలా పని చేస్తుంది? ప్రభావం

Family planning: ‘కాపర్‌ టి’ వేయించుకోవచ్చా?
వేయించుకోవచ్చా?

నాకు నాలుగు నెలల పాప ఉంది. కుటుంబ నియంత్రణ కోసం మా చెల్లెలు ‘కాపర్‌ టి’ వేయించుకోమంటోంది. అసలు కాపర్‌ టి అంటే ఏమిటి? అదెలా పని చేస్తుంది? ప్రభావం ఎంత? సురక్షితమేనా? అలాగే అది లైంగిక చర్యలో ఇబ్బంది పెట్టకుండా ఉంటుందా? దాన్ని ఉపయోగించే విషయంలో గైడెన్స్‌ ఇవ్వగలరా?

-ఓ సోదరి, తిరుపతి

యుడి (ఇంట్రా యెటెరిన్‌ డివైస్‌) అనేది చిన్న ‘టి’ ఆకారంలో ఉండే ప్లాస్టిక్‌ పరికరం. ఇది రాగి లోహంతో కప్పబడి ఉంటుంది. లేదా అండం ఫలదీకరణం చెందకుండా నియంత్రించే హార్మోన్లతో తయారై ఉంటుంది. దీన్ని వైద్యులు మీ గర్భాశయంలో అమరుస్తారు. ఐయుడి చివరన కట్టి ఉండే ఓ ప్లాస్టిక్‌ స్ట్రింగ్‌ సర్విక్స్‌ గుండా జననాంగంలోకి వేలాడుతూ ఉంటుంది. ఐయుడి సరిగా ఇమిడిపోయిందో లేదో ఆ తాడును తాకి పరీక్షించుకోవచ్చు. ఐయుడిని తొలగించేటప్పుడు కూడా వైద్యులు ఈ తాడును పట్టుకుని బయటకు లాగుతారు.

ఇదెలా పని చేస్తుందంటే?

అండంతో వీర్యంలోని శుక్ర కణాలు ఫలదీకరణ చెందకుండా వాటిని చంపటం, ఫలదీకరణ జరిగిన పిండం గర్భాశయంలో నాటుకోకుండా గర్భాశయ లైనింగ్‌ని ప్రభావితం చేయటం... ఇలా రెండు విధాలుగా పని చేస్తుంది. ఐయుడి బర్త్‌ కంట్రోల్‌ విషయంలో అత్యంత ఎక్కువ ప్రభావవంతమైనది. తక్కువ ధర, ఎక్కువ ప్రభావం, తేలికగా ఉపయోగించే వీలుండటం, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు లేకపోవటం, ఫోర్‌ప్లే, ఇంటర్‌కోర్స్‌లకు ఎలాంటి ఇబ్బంది లేకపోవటం... కాపర్‌ టికి ఉన్న అనుకూలతలు.

IMG_1778.gif

-డాక్టర్‌ షర్మిల మజుందార్‌

కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - 2022-11-24T13:07:33+05:30 IST