నలుపుదనం పోయి... నిగారింపు రావాలంటే..!

ABN , First Publish Date - 2022-02-19T18:03:35+05:30 IST

కొందరికి మెడ భాగంలో నలుపుదనం ఉంటుంది. ముఖానికి ఫేస్‌ప్యాక్‌లు వాడినప్పుడు, మెడ భాగంలోనూ అప్లై చేస్తారు. కానీ ఫలితం కనిపించదు.

నలుపుదనం పోయి... నిగారింపు రావాలంటే..!

ఆంధ్రజ్యోతి(19-02-2022)

కొందరికి మెడ భాగంలో నలుపుదనం ఉంటుంది. ముఖానికి ఫేస్‌ప్యాక్‌లు వాడినప్పుడు, మెడ భాగంలోనూ అప్లై చేస్తారు. కానీ ఫలితం కనిపించదు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మెడ భాగంలో నలుపుదనం పోవాలంటే ఇలా చేయాలి...


యాపిడ్‌ సిడార్‌ వెనిగర్‌ చర్మం పీహెచ్‌ స్థాయిలను బ్యాలెన్స్‌ చేసి, న్యాచురల్‌ గ్లో వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా ఇది మృతకణాలను తొలగిస్తుంది. ఇందులో ఉండే మాలిక్‌ యాసిడ్‌ మృతకణాల తొలగింపుకు ఉపయోగపడుతుంది. రెండు టేబుల్‌స్పూన్ల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో నాలుగు టేబుల్‌స్పూన్ల నీళ్లు కలిపి, దూదితో మెడ భాగంలో అప్లై చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు రోజులకోసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ ఉపయోగించిన తరువాత మాయిశ్చర్‌ రాయడం మరువద్దు.


 చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, చర్మం నిగారింపు సంతరించుకునేలా చేయడంలో బేకింగ్‌ సోడా కూడా ఉపయోగపడుతుంది. రెండు, మూడు టేబుల్‌స్పూన్ల బేకింగ్‌ సోడాలో కొన్ని నీళ్లు కలిపి పేస్టులా తయారు చేసి మెడ భాగంలో రాసుకోవాలి. బాగా ఆరిన తరువాత చేతి వేళ్లకు కొద్దిగా తడి అద్దుతూ మెడ భాగంలో రుద్దాలి. తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ చిట్కా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.


 బంగాళదుంపలో బ్లీచింగ్‌ గుణాలుంటాయి. ఇది డార్క్‌ ప్యాచెస్‌ను తొలగించి, చర్మం మెరిసేలా చేస్తుంది. ఒక బంగాళదుంపను తీసుకుని పొట్టు తీసి, ముక్కలుగా కట్‌ చేయాలి. వీటిని మిక్సీలో వేసి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్‌ను మెడ భాగంలో రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే మెడ భాగంలో నలుపు పూర్తిగా పోతుంది.


 పెరుగులో సహజసిద్ధమైన ఎంజైమ్స్‌ ఉంటాయి. ఇందులో నిమ్మరసం కలిపితే ప్రయోజనాలు రెట్టింపవుతాయి. రెండు టేబుల్‌స్పూన్ల పెరుగులో ఒక టీస్పూన్‌ నిమ్మరసం కలిపి మెడ భాగంలో అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. 

Read more