Awareness: కూరగాయాల విషయాల్లో ఏది నిజం?

ABN , First Publish Date - 2022-12-06T10:16:29+05:30 IST

కొన్ని రకాల కూరగాయల గురించి మనకు కొంత కన్‌ఫ్యూజన్‌ ఉంటోంది. వాటిని పచ్చిగా తింటేనే ఆరోగ్యమని కొందరంటారు. లేదు....వండితేనే మేలని ఇంకొందరంటారు. వీటిలో ఏది నిజం?

Awareness: కూరగాయాల విషయాల్లో ఏది నిజం?
ఏది నిజం?

పచ్చివే మేలా? వండి తినాలా?

కొన్ని రకాల కూరగాయల గురించి మనకు కొంత కన్‌ఫ్యూజన్‌ ఉంటోంది. వాటిని పచ్చిగా తింటేనే ఆరోగ్యమని కొందరంటారు. లేదు....వండితేనే మేలని ఇంకొందరంటారు. వీటిలో ఏది నిజం?

వీటిని పచ్చిగానే తినాలి

బీట్‌రూట్స్‌: బీట్‌రూట్‌లో మెదడుకు, గుండెకు అవసరమైన ‘ఫోలేట్‌’ ఉంటుంది. గర్భిణుల్లో పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఫోలేట్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే బీట్‌రూట్‌ను ఉడికిస్తే ఈ కాంపౌండ్‌ నశిస్తుంది. కాబట్టి బీట్‌రూట్‌ను సాధ్యమైనంత ఎక్కువగా జ్యూస్‌ రూపంలో తీసుకోవటమే మేలు.

ఉల్లిపాయలు: ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్‌ అనే ఫైటోన్యూట్రియంట్‌ ఉంటుంది. ఇది ఆస్టియోఆర్థరైటిస్‌ రాకుండా అరికడుతుంది. కాబట్టి అప్పుడప్పుడూ పచ్చి ఉల్లిపాయలు తింటూ ఉండాలి.

బెల్‌ పెప్పర్‌: పచ్చి బెల్‌ పెప్పర్‌లో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది హృద్రోగాలు, కంటి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి బెల్‌ పెప్పర్‌ను పచ్చిగా లేదా కొద్దిసేపు సాట్‌ చేయాలి గానీ మెత్తగా ఉడికించేయకూడదు.

వీటిని వండాల్సిందే!

టమేటా: టమేటాల్లో యాంటీఆక్సిడెంట్‌ ఫైటోకెమికల్‌ లైకోపైన్‌ ఉంటుంది. క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా కాపాడే ఈ పోషక పదార్థాన్ని శరీరం చక్కగా శోషించుకోవాలంటే టమేటాలను ఉడికించి తినాల్సిందే!

పుట్టగొడుగులు: వీటిలో శక్తివంతమైన పాలీశాఖరైడ్స్‌ ఉంటాయి. వాటితోపాటే స్వల్ప పరిమాణంలో టాక్సిన్స్‌ కూడా ఉంటాయి. ఈ టాక్సిన్స్‌ను హరించి పాలీశాఖరైడ్స్‌ శరీరానికి వంటబట్టాలంటే పుట్టగొడుగుల్ని ఉడికించి తినాలి.

ఆస్పరాగస్‌: క్యాన్సర్‌తో పోరాడే ఫెర్యూలిక్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే ఆస్పరాగ్‌సని ఉడికించి తినాలి.

Updated Date - 2022-12-06T10:16:30+05:30 IST