పెట్స్‌తో ఆడుకోవడం, పట్టుకోవడం వంటివి చేసేటప్పుడు..

ABN , First Publish Date - 2022-02-19T17:42:26+05:30 IST

అలర్జీకి ఇంట్లో దుమ్ము, ధూళి, డస్ట్‌మైట్స్‌, పెట్స్‌ కారణం కావచ్చు. అలాంటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అలర్జీ బారినపడకుండా చూసుకోవచ్చు.

పెట్స్‌తో ఆడుకోవడం, పట్టుకోవడం వంటివి చేసేటప్పుడు..

ఆంధ్రజ్యోతి(19-02-2022)

అలర్జీకి ఇంట్లో దుమ్ము, ధూళి, డస్ట్‌మైట్స్‌, పెట్స్‌ కారణం కావచ్చు. అలాంటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అలర్జీ బారినపడకుండా చూసుకోవచ్చు. 

ఇంట్లో పెట్స్‌ ఉంటే వాటిని పట్టుకోవడం, వాటితో ఆడుకోవడం తగ్గించాలి. 

పెట్స్‌ను బెడ్‌రూమ్‌లోకి రాకుండా చూసుకోవాలి. 

ఒకవేళ పెట్స్‌తో ఆడినప్పుడు స్నానం చేయడం, దుస్తులు మార్చుకోవడం తప్పనిసరిగా చేయాలి.  

ప్రతి వారం పెట్స్‌కి స్నానం చేయించాలి.  

బెడ్‌షీట్స్‌ని వారానికోసారి వేడినీళ్లలో శుభ్రం చేసుకోవాలి.  

ఇంట్లో ఫ్లోరింగ్‌, వుడ్‌ ఫర్నిచర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. 

వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయడం వల్ల బెడ్‌ మూలల్లో ఉండే డస్ట్‌ మైట్స్‌ పోయేలా చేసుకోవచ్చు. 

కార్పెట్‌ ఉంటే కనుక తీసివేయడం ఉత్తమం. ఇంట్లో పెట్స్‌ ఉన్న వాళ్లు కార్పెట్‌ వాడకుండా ఉండాలి. 

కిటికీ కర్టెన్లను వారానికోసారి ఉతకాలి. షెల్ఫ్‌లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. 

Updated Date - 2022-02-19T17:42:26+05:30 IST