జిడ్డు వదలాలంటే...

ABN , First Publish Date - 2022-09-05T21:20:47+05:30 IST

ఫేస్‌ ప్యాక్‌లంటే మార్కెట్‌లో లభించేవే కావు... సహజసిద్ధమైనవి ఎన్నో ఉన్నాయి. అలాంటిదే బొప్పాయి

జిడ్డు వదలాలంటే...

ఫేస్‌ ప్యాక్‌లంటే మార్కెట్‌లో లభించేవే కావు... సహజసిద్ధమైనవి ఎన్నో ఉన్నాయి. అలాంటిదే బొప్పాయి, అరటి ప్యాక్‌. ఇది ముఖం మీద జిడ్డును వదిలించి, పొడిబారిన చర్మాన్ని తాజాగా, మృదువుగా మారుస్తుంది. ఈ ప్యాక్‌లో వాడేవన్నీ సహజసిద్ధ పదార్థాలే కాబట్టి... ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. 


బొప్పాయి, అరటి ప్యాక్‌!

  • బొప్పాయి, అరటి గుజ్జు తీసుకోవాలి.
  • దీనికి తేనె చేర్చాలి. 
  • మెత్తని ముద్దలా చేసి... ముఖానికి పూసుకోవాలి.
  • పూర్తిగా ఆరనివ్వాలి తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. 

Read more