పిల్లలే లక్ష్యంగా కొత్త వ్యాధి.. అవగాహన ఉందా?

ABN , First Publish Date - 2022-08-23T18:04:13+05:30 IST

కొవిడ్‌, మంకీపాక్స్‌లకు తోడు ఇప్పుడు మరో సరికొత్త వ్యాధి వెలుగులోకొచ్చింది. మరీముఖ్యంగా పిల్లలే

పిల్లలే లక్ష్యంగా కొత్త వ్యాధి.. అవగాహన ఉందా?

కొవిడ్‌, మంకీపాక్స్‌లకు తోడు ఇప్పుడు మరో సరికొత్త వ్యాధి వెలుగులోకొచ్చింది. మరీముఖ్యంగా పిల్లలే లక్ష్యంగా దాడి చేస్తున్న ఆ వ్యాధే ‘టొమాటో ఫ్లూ’. ఈ వైరల్‌ డిసీజ్‌ గురించి అవగాహన పెంచుకోవడం అవసరం. 


కేరళలోని కొల్లాంలో మే6న వెలుగు చూసిన టొమాటో ఫ్లూ ఇప్పటివరకూ 82 మంది పిల్లలకు సోకింది. వీళ్లందరూ ఐదేళ్ల లోపు పసి పిల్లలే! ఈ వైరల్‌ ఫ్లూ గురించి లాన్సెట్‌ రెస్పిరేటరీ జోర్నల్‌లో ఒక అధ్యయన నివేదిక ప్రచురితమైంది. టొమాటో ఫ్లూలో కనిపించే లక్షణాలు కొవిడ్‌ లక్షణాలనే పోలి ఉన్నప్పటికీ, ఈ ఇన్‌ఫెక్షన్‌ చికున్‌గున్నా, డెంగూ జ్వరాల ఆఫ్టర్‌ ఎఫెక్ట్‌ అయి ఉండవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది. పెద్దల్లో వ్యాధినిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది కాబట్టి వారిలో ఈ ఫ్లూ కనిపించడం అరుదు. నొప్పితో కూడిన బొబ్బలు శరీరమంతా వ్యాపించి, అవి క్రమేపీ టొమాటో సైజుకు పెరుగుతాయి కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్‌కు ఆ పేరు పెట్టడం జరిగింది. అలాగే టొమాటో ఫ్లూలో విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపు, నిస్సత్తువ లాంటి లక్షణాలు కూడా వేధిస్తాయి. అయితే ఈ వ్యాధిని కట్టడి చేసే నిర్దిష్ట మందులు లేవనీ, అయినప్పటికీ ఇది స్వీయ నియంత్రిత రుగ్మత కాబట్టి, భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదనీ వైద్యులు చెప్తున్నారు. అయితే తేలికగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ వ్యాధి సోకిన పిల్లలను ఇతర పిల్లలకు దూరంగా ఉంచాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-08-23T18:04:13+05:30 IST