Nose: స్రావం రంగును బట్టి..

ABN , First Publish Date - 2022-11-15T13:02:23+05:30 IST

ముక్కు నుంచి వెలువడే స్రావం రంగును బట్టి ఆరోగ్య సమస్యను తేలికగా అంచనా వేయవచ్చు. ఆరోగ్యం మరింత దెబ్బతినకుండా ఉండాలంటే

Nose: స్రావం రంగును బట్టి..
రంగును బట్టి..

ముక్కు నుంచి వెలువడే స్రావం రంగును బట్టి ఆరోగ్య సమస్యను తేలికగా అంచనా వేయవచ్చు. ఆరోగ్యం మరింత దెబ్బతినకుండా ఉండాలంటే, స్రావం రంగుల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం.

పారదర్శకం: మన ముక్కులోని కణజాలంలో రోజంతా ఇది తయారవుతూ గొంతులో నుంచి కిందకు జారి, పొట్టలోకి చేరుకుంటూ ఉంటుంది. ఈ సహజసిద్ధమైన మ్యూకస్‌ ఆరోగ్యకరమే!

తెలుపు: ముక్కులోని కణజాలం వాపుకు గురైంది అనడానికి ఇదొక సూచన. దాంతో మ్యూకస్‌ కదలికలు తగ్గుతాయి. ఫలితంగా కఫం తేమను కోల్పోయి, చిక్కబడి తెల్లగా మారుతుంది.

పసుపుపచ్చ: తెల్ల రక్తకణాలు ఇతరత్రా కణాలు మైక్రోబ్‌ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతున్నాయని అర్థం. ఈ పరిస్థితిలో జలుబు రెండు వారాల పాటు వేధిస్తుంది.

ఆకుపచ్చ: దీన్లో చిక్కని మృత తెల్ల రక్త కణాలుంటాయి. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు ఇది సూచన. ఒకట్రెండు రోజుల్లో కఫం మామూలుగా మారకపోయినా, జ్వరం తోడైనా వెంటనే వైద్యులను సంప్రతించాలి.

గులాబీ లేదా ఎరుపు: ముక్కులోని కణజాలం చిట్లి రక్తస్రావం అవుతుందనడానికి సూచన ఇది. తేమ లోపించి, నాశికా రంధ్రాలు పొడిడారినప్పుడు ఇలా జరుగుతుంది.

గోధుమ రంగు: దుమ్ము, ధూళి పీల్చుకున్నప్పుడు ఇలా జరుగుతుంది.

నలుపు: పొగతాగే అలవాటు లేకపోయినా, ఇలాంటి మ్యూకస్‌ కనిపిస్తే, వ్యాధినిరోధక వ్యవస్థ దెబ్బతిందని అర్థం చేసుకోవాలి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.

Updated Date - 2022-11-15T13:02:25+05:30 IST