బీజేపీ విజయోత్సవాలలో మోదీ

ABN , First Publish Date - 2022-03-10T23:10:47+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో పార్టీ శ్రేణులు సంబరాలు..

బీజేపీ విజయోత్సవాలలో మోదీ

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరుగనున్న విజయోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయానికి మోదీ చేరుకుంటారు. ఆయన రాక సందర్భంగా సెంట్రల్ ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌‌‌లోని పార్టీ కార్యాలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈ సందర్భంగా మోదీ ప్రసంగించనున్నారు. హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు మంత్రులు, పార్టీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా, సాయంత్రం 5.30 గంటల వరకూ ఐదు రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలను బట్టి ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకోవడం ఖాయమైంది. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లోనూ బీజేపీ తిరిగి అధికారం నిలుపుకొంది.

Read more