విజయోత్సవాలపై నిషేధం ఎత్తివేసిన ఈసీ

ABN , First Publish Date - 2022-03-10T20:32:19+05:30 IST

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం..

విజయోత్సవాలపై నిషేధం ఎత్తివేసిన ఈసీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం ప్రకటించింది. కౌంటింగ్ ముందు, కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలపై నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేసింది. అయితే, ఎస్‌డీఎంఏ ఆదేశాలు, జిల్లా అధికారుల ఆంక్షలకు అనుగుణంగానే సడలింపులు ఉంటాయని పేర్కొంది. దీనికి ముందు, కోవిడ్ కారణంగా విజయోత్సవ ర్యాలీలతో సహా ఇతర ఎన్నికల అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. క్రమంగా కోవిడ్ పరిస్థితులు మెరుగుపడటంతో కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల నిబంధనలను ఈసీ సడలిస్తూ వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరుగుతుండటం, ఫలితాలు వెలువడుతుండటంతో గెలుపు దిశగా పయనిస్తున్న పార్టీలు సంబరాలకు సిద్ధం అవుతున్నాయి.

Updated Date - 2022-03-10T20:32:19+05:30 IST