కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఈసీ ఆదేశం

ABN , First Publish Date - 2022-02-20T01:11:51+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేయాలని పంజాబ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు..

కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఈసీ ఆదేశం

మొహాలి: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేయాలని పంజాబ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శిరోమణి అకాలీదళ్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో సాస్ నగర్ సీనియర్ ఎస్‌పీకి చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఈ ఆదేశాలిచ్చారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఇతర పార్టీలపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఈసీ ఈ ఆదేశాలిచ్చింది. ప్రజలకు తప్పుడు సందేశాలు వెళ్లేవిధంగా శిరోమణి అకాలీదళ్, ఇతర పార్టీల ఇమేజ్‌ను దెబ్బతీస్తూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి అకాలీదళ్ తీసుకువెళ్లింది. తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.

Read more