కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2022-03-10T20:53:23+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతుండటం, కాంగ్రెస్ పార్టీ నిరాశాజనక ఫలితాలను..

కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే: సంజయ్ రౌత్

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతుండటం, కాంగ్రెస్ పార్టీ నిరాశాజనక ఫలితాలను చవిచూస్తుండటంపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఫలితాలు చవిచూస్తోందన్నారు. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు కనిపించడం లేదని చెప్పారు. పంజాబ్‌లో ప్రజలు వేరే ఆప్షన్ ఎంచుకున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నుకున్నారని అన్నారు. బీజేపీ విజయం వెనుక ఆ పార్టీ ఎన్నికల మేనేజిమెంట్ కూడా కారణమని వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌, మణిపూర్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకోవడం ఖరారు కాగా, పంజాబ్‌లో ఆప్ గెలుపు నిశ్చయమైంది. గోవాలోనూ కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది.

Read more