గిరిజన ఇంజనీర్లు ఉద్యోగాల్ని అందుకోవాలి

ABN , First Publish Date - 2022-06-07T22:48:33+05:30 IST

బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన గిరిజన యువత ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, జాతీయ భవన నిర్మాణ సంస్థ సమన్వయంతో వివిధ ఉపాధి కోర్సుల్లో..

గిరిజన ఇంజనీర్లు ఉద్యోగాల్ని అందుకోవాలి

గిరిజన సంక్షేమ కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తు

హైదరాబాద్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన గిరిజన యువత ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, జాతీయ భవన నిర్మాణ సంస్థ సమన్వయంతో వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన గిరిజన యువతకు ఫినిషింగ్‌ స్కూల్‌ ప్రోగ్రాం శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది గిరిజన అభ్యర్థులకు ధ్రువపత్రాలు, ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ లెటర్స్‌ను కమిషనర్‌ అందజేశారు. గిరిజన యువత కోసం ప్రత్యేకంగా అందిస్తున్న శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.  

Read more