వైద్య విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2022-09-29T19:23:42+05:30 IST

తెలంగాణ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. MBBS, BDS అడ్మిషన్ల నిబంధనలను వైద్యారోగ్యశాఖ సవరించింది. తెలంగాణ విద్యార్థులకు

వైద్య విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. MBBS, BDS అడ్మిషన్ల నిబంధనలను వైద్యారోగ్యశాఖ సవరించింది. తెలంగాణ విద్యార్థులకు మెజారిటీ సీట్లు లభించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ విద్యార్థులకే వెయ్యికి పైగా MBBS- B కేటగిరి సీట్లు దక్కనున్నాయి. B కేటగిరి సీట్లలో 85 శాతం లోకల్‌ రిజర్వేషన్లు.. 15శాతం ఓపెన్‌ కోటాలో సీట్లు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో డాక్టర్‌ చ‌దవాల‌నుకునే స్థానిక విద్యార్థులకు అవ‌కాశాలు పెర‌గ‌నున్నాయి.

Read more