Posts: కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా కొలువులు

ABN , First Publish Date - 2022-12-05T12:22:08+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Central schools) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టీచింగ్‌(Teaching), నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

Posts: కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా కొలువులు
టీచింగ్ పోస్టులు

మొత్తం ఖాళీలు 6990

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Central schools) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టీచింగ్‌(Teaching), నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. న్యూఢిల్లీ(New delhi)లోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) ఈ భర్తీ ప్రక్రియను చేపడుతుంది.

1. ప్రిన్సిపాల్‌: 239 పోస్టులు

2. వైస్‌ ప్రిన్సిపాల్‌: 203 పోస్టులు

3. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ): 1409 పోస్టులు

4. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ): 3176 పోస్టులు

5. లైబ్రేరియన్‌: 355 పోస్టులు

6. అసిస్టెంట్‌ కమిషనర్‌: 52 పోస్టులు

7. పీఆర్‌టీ(మ్యూజిక్‌): 303 పోస్టులు

8. ఫైనాన్స్‌ ఆఫీసర్‌: 6 పోస్టులు

9. అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌): 2 పోస్టులు

10. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(ఏఎస్‌ఓ): 156 పోస్టులు

11. హిందీ ట్రాన్స్‌లేటర్‌: 11 పోస్టులు

12. సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(యూడీసీ): 322 పోస్టులు

13. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎల్‌డీసీ): 702 పోస్టులు

14. స్టెనోగ్రాఫర్‌(గ్రేడ్‌-2): 54 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణత. సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌) పేపర్‌-2 అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: స్టెనో, జేఎస్‌ఏ పోస్టులకు 27 ఏళ్లు; ఎస్‌ఎస్‌ఏ, పీఆర్‌టీ పోస్టులకు 30 ఏళ్లు; హెచ్‌టీ, ఏఎస్‌ఓ, ఏఈ, ఎఫ్‌వో, లైబ్రేరియన్‌, టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు; ఏసీ, ప్రిన్సిపాల్‌ పోస్టులకు 50 ఏళ్లు; పీజీటీ పోస్టులకు 40 ఏళ్లు; వైస్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్‌ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా

తెలంగాణ, ఏపీలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌, అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: కేవీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో

దరఖాస్తు రుసుము: అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌- రూ.2300; పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ, ఫైనాన్స్‌ ఆఫీసర్‌, ఏఈ, లైబ్రేరియన్‌, ఏఎస్‌వో, హెచ్‌టీ-రూ.1500; ఎస్‌ఎస్‌ఏ, స్టెనో, జేఎస్‌ఏ- రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, ఎక్స్‌ సర్వీమన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: డిసెంబరు 5

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 26

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/

KV-Logo.gif

Updated Date - 2022-12-05T12:29:12+05:30 IST