Krea University: స్కూల్ ఆఫ్ ఇంటర్‌వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెన్ యూజీ ప్రోగ్రాం అడ్మిషన్లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-28T21:09:34+05:30 IST

క్రియా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్‌వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (SIASS) బీఏ(ఆనర్స్), బీఎస్సీ (ఆనర్స్), అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో 2023-26

Krea University: స్కూల్ ఆఫ్ ఇంటర్‌వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెన్  యూజీ ప్రోగ్రాం అడ్మిషన్లు ప్రారంభం

శ్రీసిటీ: క్రియా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్‌వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (SIASS) బీఏ(ఆనర్స్), బీఎస్సీ (ఆనర్స్), అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో 2023-26 సంవత్సరానికి గాను తొలి రౌండ్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 5తో ఈ ప్రక్రియ ముగుస్తుంది. క్రియా గ్రాడ్యుయేట్లలో చాలామంది ఆశావహమైన ఉన్నత విద్యావకాశాల కోసం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, హారిస్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, చికాగో విశ్వవిద్యాలయం, కార్నీజ్ మెలాన్ విశ్వవిద్యాలయం వంటి ఎన్నో విశ్వవిద్యాలయాలకు వెళ్లారు, మరికొందరు ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

క్రియా విశ్వవిద్యాలయం (Krea University) మూడేళ్ల బీఏ (ఆనర్స్), బీఎస్సీ(ఆనర్స్) డిగ్రీలను, నాలుగో ఏడాది అడ్వాన్స్‪డ్ స్టడీస్ చేసే వీలుతో అందుబాటులోకి తెచ్చింది. మొదటి ఏడాది పాఠ్యాంశాలు క్రియా వారి ప్రత్యేక ఇంటర్‌వోవెన్ లెర్నింగ్ నమూనా ఆధారంగా రూపుదిద్దినవి. ఇవి వారి కెరీర్‌ను, జీవిత ఆసక్తులకి ఉత్తమంగా నప్పేలా మేజర్‌ని గుర్తించుకోడానికి విద్యార్థులకి దోహదం చేస్తాయి. క్రియాలో అవసరమైన 11 కోర్ అండ్ స్కిల్స్ కోర్సులు పూర్తి చేసిన తరవాత, విద్యార్థులు రెండో సంవత్సరంలో మేజర్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ విశ్వవిద్యాలయం 12 విభాగాల్లో మేజర్స్‌ని, నాలుగు జాయింట్ మేజర్స్‌ని, 15 మైనర్లని అందుబాటులో ఉంచుతోంది, ఇవన్నీ డివిజన్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, డివిజన్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్, డివిజన్ ఆఫ్ సైన్సెస్ కింద ఉంటాయి.

అడ్మిషన్ విధాన క్రమంలో తగిన విధంగా పూర్తిగా నింపిన దరఖాస్తులు దాఖలు చేయడం, దానివెంట క్రియా ఆప్టిట్యూట్ పరీక్ష, క్రియా ఇమ్మర్సివ్ కేస్ అనాలసిస్ లేదంటే వ్యక్తిగత ఇంటర్వ్యూ వుంటాయి. అర్హులైన విద్యార్థులకి కాలేజీ బోర్డు ఇండియా స్కాలర్స్ ప్రోగ్రాం, క్రియా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో 100 శాతం స్కాలషిప్ అందిస్తుంది. ఎస్ఏటీలో 1300 లేదా అంతకుమించి స్కోర్ చేసిన విద్యార్థులను వార్షిక పద్ధతిలో ఏప్రిల్ చివరికి టాప్ పెర్ఫార్మర్స్‌గా కాలేజీ బోర్డు గుర్తిస్తుంది. ఏడాదికి రూ. 8 లక్షలకన్నా తక్కువ కుటుంబ ఆదాయం కలిగి, నిజమైన ఆర్థిక అవసరాన్ని ప్రదర్శించగలిగిన టాప్ పెర్ఫార్మర్స్, క్రియా విశ్వవిద్యాలయంలో వారి విద్యా కార్యక్రమంలో మొత్తం కాలానికి ట్యూషన్ ఫీజుకోసం దరఖాస్తు చేసుకోడానికి అర్హులవుతారు.

వారివారి దేశాల్లో XII గ్రేడ్ లేదా తత్సమానమైన విద్యని పూర్తి చేసిన లేదా చదువుతున్న వారు, 2023 ఆగస్ట్ 1వ తేదీకి 21 ఏళ్ళు నిండిన విద్యార్థులు అండర్‪గ్రాడ్యుయేట్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. బోర్డు విద్య ఏదైనప్పటికీ దాని గురించి పట్టింపులేదు, అంటే.. ఐఎస్సీ, సీబీఎస్ఈ, స్టేట్ బోర్డ్స్, ఐబీ, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎ లెవల్స్, ఇతర అంతర్జాతీయ ఎగ్జామినేషన్ బోర్డ్స్ విద్యని అభ్యసించిన వారుకూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐఎఎస్ లో కోర్సులకి దరఖాస్తు చేసుకోడానికి కనీస కటాఫ్ స్కోరు లేదా ఎక్స్‪ట్రా -కరికులర్ ప్రతిభలు కూడా ఉండాల్సిన పనిలేదు.

Updated Date - 2022-11-28T21:09:36+05:30 IST