Entrance Test: జనవరి 8న సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2022-12-01T11:51:52+05:30 IST

ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష(Allindia Sainik Schools Entrance Test) (ఏఐఎస్ఎస్ఈ) వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహిస్తున్నట్టు కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరుణ్‌ కులకర్ణి తెలిపారు. 2023-24 విద్యా

Entrance Test: జనవరి 8న సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష
సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

కర్నూలు(స్పోర్ట్స్‌), నవంబరు 30: ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష(Allindia Sainik Schools Entrance Test) (ఏఐఎస్ఎస్ఈ) వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహిస్తున్నట్టు కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరుణ్‌ కులకర్ణి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9 తరగతుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా 33 సైనిక్‌ పాఠశాలల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయస్సు 2023 మార్చి 31 నాటికి 10, 12 సంవత్సరాల మధ్య ఉండాలని, 9వ తరగతిలో ప్రవేశానికి 2023 మార్చి 31 నాటికి 13, 15 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. పరీక్ష రుసుం ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.650 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దరఖాస్తులను డిసెంబరు 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్‌లైన్‌లో పంపాలని కోరారు. ఇతర వివరాల కోసం Https://aissee. nta.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2022-12-01T11:51:53+05:30 IST