ప్రమాదకర స్థితిలో బడులు.. భయంభయంగా చదువులు

ABN , First Publish Date - 2022-08-31T17:43:32+05:30 IST

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల(Government schools)ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం యేటా ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా.. సర్కారీ బడి పరిస్థితి మాత్రం మారడం లేదు. సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో బడి

ప్రమాదకర స్థితిలో బడులు.. భయంభయంగా చదువులు

జిల్లాలో నత్తనడకన సాగుతున్న ‘మన ఊరు-మన బడి’

శిథిలావస్థ బడుల్లో భయంభయంగా చదువులు

వానాకాలంలో పలుచోట్ల మూతబడుతున్న పాఠశాలలు

సమస్యల్లో సర్కారీ బడులు

జిల్లావ్యాప్తంగా మొత్తం 678 ప్రభుత్వ పాఠశాలలు


ఆదిలాబాద్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల(Government schools)ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం యేటా ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా.. సర్కారీ బడి పరిస్థితి మాత్రం మారడం లేదు. సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో బడి పాడుబడిపోయి.. శిథిలావస్థకు చేరుకుంటోంది. దీంతో నిత్యం భయంభయంగానే చదువుకునే పరిస్థితులు ఎదురవుతున్నా యి. ముఖ్యంగా ఏజెన్సీ మారుమూల గిరిజన గ్రామాల్లోనైతే పరిస్థి తులు మరీ అధ్వానంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 678 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇప్పటికే 268 తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నట్లు విద్యాశాఖాధికారులు(Education officials) గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 12 రకాల పనుల ను చేపట్టేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. అయినా అరకొర నిధులతో అంతంత మాత్రంగానే ప నులు ముందుకు సాగుతున్నాయి. వానాకాలంలో సర్కారు బడుల్లో సమస్యల కారణంగా చదువుకునే పరిస్థితులు లేక విద్యార్థులు రోజుల తరబడి ఇంటికే పరిమితమవుతున్నా రు. అయినా సంబంధిత శాఖ అధికారులు సమస్యాత్మక ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించడం లేదంటున్నారు. 

 

నామమాత్రంగానే మొదటి విడత

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాకంగా అమలు చేస్తున్నా.. ‘మన ఊరు-మన బడి’ (Mana uru-mana badi)పథకం కింద చేపట్టిన మొదటి విడత పనులు నామమాత్రంగానే కొనసా గుతున్నాయి. జిల్లాలో మొత్తం 237 పాఠశాలలను ఎంపిక చేసి పనులను ప్రారంభించగా.. ఇప్పటి వరకు 146 పాఠశాలల్లోనే పనులు ప్రారంభమయ్యా యి. ఇందులో కేవలం 20 పాఠశాలల్లో పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. నెలల తరబడి మొదటి విడతకే మోక్షం లేదని, ఇంకా రెండో విడత ఎప్పుడు ప్రారంభిస్తారో? తెలియదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రూ.2కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇందులో కేవలం 10 శాతం నిధులను అడ్వాన్సు రూపంలో రూ.కోటీ 80లక్షలను కేటాయించారు. అయినా పనులు అనుకున్నంత స్థాయిలో జరుగ డం లేదు. కొన్నిచోట్ల సర్పంచ్‌లే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న విద్యా కమిటీల పదవీ కాలం ముగిసినా.. కొత్తగా ఎన్నికలు నిర్వహించకుండానే పాత కమిటీలతోనే తీర్మానాలు చేయిస్తూ పనులు చేపడుతున్నారు. దీంతో పలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులపై విద్యా కమిటీలకు పట్టింపే లేకుండా పోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. 


చినుకు పడితే బడి బందే..

వర్షాకాలం(rainy season)లో తరగతులు నిర్వహించడం కష్ట సాధ్యంగానే మారిందంటు న్నారు. వర్షం కురిస్తే పాఠశాలల గదులు, ఆవరణ పూర్తిగా వర్షపు నీటితో చిత్తడిగా మారిపోతున్నాయి. పాఠశాల గదుల పైకప్పులు ఊరవడంతో.. తరగతి గదుల్లో కూర్చొలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గదులకు సరైన కిటికీలు, తలుపులు లేకపోవడంతో.. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పశు వులు, కుక్కలు, పందులు పాఠశాలల్లో స్వైర విహారం చేస్తున్నాయి. పైకప్పులు, గోడలు తడిసిముద్దవడంతో ఎప్పుడు కూలుతాయో? చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కొన్ని పాఠశాలల తరగతి గదుల్లో పైకప్పులు పెచ్చులూడి పోవడం, రేకులు, కూనలు, విరిగి పడడంతో ప్రమా దకరంగా మారుతున్నాయి. దీంతో చెట్ల కిందనే ఆరుబయట చదువులు సాగు తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోజుల తరబడిబడి తలుపులు మూసి వేయాల్సి వస్తోంది. జిల్లాలో కొన్ని పాఠశాలలకు చినుకుపడి తే చాలు వణుకు పుట్టిస్తోంది. పలు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన రికార్డులు, మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే రేషన్‌బియ్యం, పాఠ్యపుస్తకాలు తడిసి ముద్దవుతున్నాయని వాపోతున్నారు. సరైన సదుపాయాలు లేకపోవడం తో సర్కారీ చదువులు ప్రశ్నార్థకంగానే మారుతున్నాయి.


దశల వారీగా మరమ్మతులు చేపడుతున్నాం: ప్రణీత, డీఈవో, ఆదిలాబాద్‌

ప్రభుత్వ పాఠశాలల్లో దశల వారీగా మరమ్మతు పనులను చేపడుతున్నాం. అవసరమైన చోట నూతనం గా తరగతి గదులను నిర్మిస్తున్నాం. మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణాలను కూడా చేపడుతున్నాం. ‘మన ఊరు-మన బడి’ ప్రణాళిక కింద మొదటి విడతలో 237 పాఠశాలల్లో పనులు నిర్వహించేందుకు ఎంపిక చేయడం జరిగింది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

Read more