మా బడి దూరం చేయొద్దు..

ABN , First Publish Date - 2022-09-13T21:21:01+05:30 IST

పాలకొల్లు నియోజకవర్గం(Palakollu Constituency)లో 41 పాఠ శాలలను విలీనం చేయడం వల్ల విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నా, ఆందోళనలు చేస్తున్నా పట్టిం చుకోకపోవడంతో సోమవారం పాలకొల్లు ఎమ్మెల్మే నిమ్మల రామానాయుడు

మా బడి దూరం చేయొద్దు..

కలెక్టర్‌కు స్పందనలో విద్యార్థుల వినతి

పాలకొల్లు నుంచి తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు..

ఎమ్మెల్యే నిమ్మల మద్దతు     


భీమవరం టౌన్‌, సెప్టెంబరు 12: పాలకొల్లు నియోజకవర్గం(Palakollu Constituency)లో 41 పాఠ శాలలను విలీనం చేయడం వల్ల విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నా, ఆందోళనలు చేస్తున్నా పట్టిం చుకోకపోవడంతో సోమవారం పాలకొల్లు ఎమ్మెల్మే నిమ్మల రామానాయుడు(MLA Nimmala Ramanaidu) ఆధ్వర్యంలో పలు ప్రాంతాల విద్యార్థులు, వారి తల్లి దండ్రులు భీమవరంలోని కలెక్టర్‌ కార్యాయలంలో జరిగిన స్పందనలో కలెక్టర్‌ ప్రశాంతికి వినతిపత్రం అందించారు. పాలకొల్లు నుంచి ఆటోల్లో వచ్చిన వారు క్యూ పాటించారు. చిన్నారులతో కలెక్టర్‌ మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లులు కూడా పాఠశాలలను విలీనం వల్ల తమ పిల్లలు, తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మల అన్ని ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రుల తరపున వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందిం చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ పెనుమత్స రామచంద్రరాజు, గడేటి వెంకటేశ్వరరావు, పెచ్చెటి నరసింహరావు, పి.రజని, పీతల శ్రీను తదితరులు ఉన్నారు. ‘ మా నియోజకవర్గంలో 41 పాఠశాలలు విలీనం చేశారు. రెండునెలలుగా తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. చిన్న పిలల్లలు శ్మశా నాలు, కాల్వలు, మైయిన్‌ రోడ్డులను దాటుకుని వెళ్లాల్సి రావ డంతో ఇబ్బందులు పడుతున్నారు. నాడు–నేడు పేరిట రంగు లువేసి టైల్స్‌, విద్యుత్‌, మరుగుదొడ్లు, మరమ్మతులు చేశారని, పాఠశాలల విలీనంతో రూ.కోట్ల ప్రజాధనం వృథాగా మారింది. వీలిన ప్రక్రియ ఆపేవరకు పోరాటం కొనసాగిస్తాం, తల్లిదం డ్రులకు పూర్తి మద్దతు ఇస్తాం’.. అని ఎమ్మెల్యే నిమ్మల పేర్కొ న్నారు. ‘లంకలకోడేరులో ఊరిలోని పాఠశాలను మూసి వేసి రోడ్డుపక్కను చెరువు వద్ద ఉన్న ఉన్నతపాఠశాలకు మా ర్చారు. స్కూల్‌కు వెళ్లే మార్గంలో మందుబాబులు పగుల గొట్టిన సీసా పెంకులు, మరో పక్క చెరువు ఉంది. ఇటీవల ఒక యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. పిల్లలను పాఠశాలకు పంపాలంటే భయం వేస్తోంది’.. అంటూ లంకల కోడేరుకు చెందిన అన్నపూర్ణ వాపోయింది.



Updated Date - 2022-09-13T21:21:01+05:30 IST