NU: ఫౌండర్స్ గ్రోత్ క్యాంప్‌ను నిర్వహించిన ‘నిట్ యూనివర్సిటీ’

ABN , First Publish Date - 2022-11-22T20:56:20+05:30 IST

నిట్ యూనివర్సిటీ (NU) తొలిసారి పౌండర్స్ గ్రోత్ క్యాంప్‌ను నిర్వహించింది. మూడు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు

NU: ఫౌండర్స్ గ్రోత్ క్యాంప్‌ను నిర్వహించిన ‘నిట్ యూనివర్సిటీ’
NU

న్యూఢిల్లీ: నిట్ యూనివర్సిటీ (NU) తొలిసారి పౌండర్స్ గ్రోత్ క్యాంప్‌ను నిర్వహించింది. మూడు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు తొలిదశ ఎడ్‌టెక్‌ సంస్ధల వ్యవస్థాపకులైన ఎయిర్‌బ్లాక్‌కు చెందిన విదేత్‌ జైశ్వాల్‌, ఎడ్‌యోధ నుంచి అర్మాన్‌ అహ్మద్‌, ఎక్స్‌పెర్టాన్స్‌ నుంచి జతిన్‌ సోలంకి, ఇన్సైడ్‌ నుంచి మన్వీందర్‌ సింగ్‌, పర్సెపెక్ట్‌ ఏఐ నుంచి జిగ్నేష్‌ తలశిల, స్కూల్‌ ఆఫ్‌ యాక్సలరేటెడ్‌ లెర్నింగ్‌ నుంచి ప్రతీక్‌ అగర్వాల్‌, యులెక్ట్జ్ లెర్నింగ్‌సొల్యూషన్స్‌ నుంచి రమణ్‌ తల్వార్‌, వాణి డాట్‌ కోచ్‌ నుంచి రష్మీ ఝా హాజరయ్యారు.

నిట్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ రాజేంద్ర ఎస్‌ పవార్‌ మాట్లాడుతూ.. ఎడ్‌టెక్ అత్యంత కఠినమైన రంగమని అభిప్రాయపడ్డారు. అభ్యాసం కోసం సాంకేతిక వేదికను సృష్టించడం అంత సులభమేమీ కాదన్నారు. ఈ రంగంలో విజయవంతం కావాలంటే వినూత్నమైన ఆలోచనలు కావాలన్నారు. భారతదేశంలో ఈ రంగం నిధుల కొరతతో ఇబ్బంది పడుతుందని పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా తాము విద్యారంగంపై దృష్టి కేంద్రీకరించినట్టు వివరించారు. ఈ మూడు రోజుల సదస్సులో ఎడ్‌టెక్‌ ఫౌండర్లకు పరిశ్రమ నిపుణులు, సంభావ్య మదుపరులు, సహచర సంస్ధల సభ్యులను కలుసుకునే అవకాశం కలిగింది.

Updated Date - 2022-11-22T20:56:22+05:30 IST