ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదల

ABN , First Publish Date - 2022-03-16T18:05:00+05:30 IST

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. మే 6 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 6 నుంచి 24 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది...

ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. మే 6 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 6 నుంచి 24 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షల తేదీలు మారడంతో ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్చాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్‌టీఏ ప్రకటించిన తాజా షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 21న మొదలై, మే 4వ తేదీన ముగియనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 31 వరకు జరగనున్నాయి.Read more