ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-17T20:04:25+05:30 IST

రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాలో ఉపాధ్యాయుని దెబ్బలకు దళిత విద్యార్థి(Dalit student) మరణించిన సంఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(National Commission for Protection of Child Rights)(ఎన్‌సీపీసీఆర్‌) తీవ్రంగా

ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

రాజస్థాన్‌లో దళిత బాలుడి మృతిపై బాలల హక్కుల కమిషన్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 16:  రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాలో ఉపాధ్యాయుని దెబ్బలకు దళిత విద్యార్థి(Dalit student) మరణించిన సంఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(National Commission for Protection of Child Rights)(ఎన్‌సీపీసీఆర్‌) తీవ్రంగా స్పందించింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఎఫ్‌ఐఆర్‌ కాపీలతోపాటు నిందితునిపై తీసుకున్న చర్యల వివరాలను ఏడు రోజుల్లోగా తమకు అందజేయాలని ఆదేశించింది. కాగా, బాలుడి మరణానికి నిరసనగా జాలోర్‌ జిల్లా బరన్‌ మున్సిపాలిటీకి చెందిన 12 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.

Updated Date - 2022-08-17T20:04:25+05:30 IST