31లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-03-18T15:01:04+05:30 IST

జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాలకు ఈనెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం...

31లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు


హైదరాబాద్‌ సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాలకు ఈనెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 16 వేల పోస్టు మెట్రిక్‌ దరఖాస్తులు అందాయని, ఇందులో ప్రీ మెట్రిక్‌ దరఖాస్తులు 10 వేలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. తహసీల్దార్ల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రామారావు, జిల్లా విద్యాధికారి రోహిణి, బీసీ వెల్ఫేర్‌ అధికారి ఆశన్న, గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, డిప్యూటీ డీఈఓలు, ఏఎ్‌సఓలు పాల్గొన్నారు. 

Read more