Inter సప్లిమెంటరీలో 1,28,705 మంది ఉత్తీర్ణత
ABN , First Publish Date - 2022-08-31T16:48:56+05:30 IST
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష(Intermediate Supplementary Examination)ల ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్‌తో పాటు ఒకేషనల్ కలిపి మొత్తం 1,28,705 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 3 నుంచి 12వ తేదీ

1,28,573 మందికి మెరుగైన మార్కులు
అమరావతి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష(Intermediate Supplementary Examination)ల ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్‌తో పాటు ఒకేషనల్ కలిపి మొత్తం 1,28,705 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు జరిగిన సప్లిమెంటరీ, బెటర్మెంట్ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు మంగళవారం తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. రెగ్యులర్ స్ర్టీమ్... మొదటి సంవత్సరంలో 1,76,942 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 61,410 (35శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం విద్యార్థులు 1,51,889 మంది పరీక్షలు రాయగా 50,691 (33శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్ స్ర్టీమ్(Vocational stream)... మొదటి సంవత్సరంలో 18,399 మందికి 7,680 (42శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో 19,313 మందికి 8,924 (46శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో మార్చి పరీక్షల ఫలితాలు కలిపి మొత్తంగా ఇంటర్మీడియట్లో 70.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టయింది. బెటర్మెంట్ కోసం జనరల్ స్ర్టీమ్‌లో 1,47,164 మంది పరీక్షలు రాయగా 1,28,573 మందికి మార్కుల్లో పెరుగుదల లభించింది. ఒకేషనల్ స్ర్టీమ్‌లో 3,386 మంది రాయగా 994 మందికి మెరుగైన మార్కులు వచ్చాయి. కాగా విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం సెప్టెంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఇంటర్‌బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు.