ఇంటర్‌ కాలేజీలకు 9 వరకు సెలవులు

ABN , First Publish Date - 2022-10-03T17:47:49+05:30 IST

ఇంటర్మీడియట్‌ కాలేజీల(Intermediate Colleges)కు ఆదివారం నుంచి ఈనెల 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి

ఇంటర్‌ కాలేజీలకు 9 వరకు సెలవులు

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ కాలేజీల(Intermediate Colleges)కు ఆదివారం నుంచి ఈనెల 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని, ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని, అలాగే ప్రిన్సిపాళ్లపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Read more