ఆరుబయటే బోధన

ABN , First Publish Date - 2022-09-17T19:42:57+05:30 IST

తరగతి గది లేదు. విద్యార్థులు కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు లేవు. కనీసం నేల కూడా సరిగ్గా లేదు. ఎండ కాసినా.. వాన వచ్చినా ఆరుబయట ఉండాల్సిందే. ఇదీ

ఆరుబయటే బోధన

శ్రీకాకుళం, కొత్తూరు: తరగతి గది లేదు. విద్యార్థులు కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు లేవు. కనీసం నేల కూడా సరిగ్గా లేదు. ఎండ కాసినా.. వాన వచ్చినా ఆరుబయట ఉండాల్సిందే. ఇదీ కొత్తూరు మండలంలోని అబలాసింగి పాఠశాల దుస్థితి. మండలంలోని అత్యధిక ఎత్తులో ఉన్న నడుముగూడ జీపీఎస్‌ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో.. అబలాసింగిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 22 మంది విద్యార్థులు ఉండగా.. ఒక సీఆర్టీ పని చేస్తున్నారు. తరగతి గదితో పాటు కనీస సౌకర్యాలు ఆరుబయటే బోధిస్తున్నారు. శుక్రవారం ఎంఈవో బోయిన శ్రీధర్‌.. ఈ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎంఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని కోరారు. 

Updated Date - 2022-09-17T19:42:57+05:30 IST