అందని పుస్తకం.. అర్థంకాని పాఠం

ABN , First Publish Date - 2022-09-19T21:43:24+05:30 IST

ఇంటర్‌ విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందలేదు. ఫలితగా అధ్యాపకులు చెప్పే పాఠాలు అర్థంకావడం లేదని, మొక్కుబడిగా బోధన జరుగుతోందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి

అందని పుస్తకం.. అర్థంకాని పాఠం

ఇంటర్‌ విద్యార్థుల ఎదురుచూపులు

ఇంకా కొనసాగుతున్న అడ్మిషన్లు  


ఖమ్మం, ఖానాపురం హవేలీ, సెప్టెంబరు18: ఇంటర్‌ విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందలేదు. ఫలితగా అధ్యాపకులు చెప్పే పాఠాలు అర్థంకావడం లేదని, మొక్కుబడిగా బోధన జరుగుతోందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న గ్రా మాల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, ఆర్థిక సామాజిక పరిస్థితులు, విద్యాసం స్థలు దూరంగా ఉండటంతో జిల్లాలో చాలా మంది పదో తరగతితోనే చదువు మానేస్తున్నా రు. బాలారిష్ఠాలు దాటి ఉన్నత విద్య కో సం కళాశాలలకు వెళ్లిన వారికి మొదటి ఏడాదే ఇలా జరగడంతో చాలామంది ఆ చదువులకు దూరమవుతున్నారు.


కొత్త ప్రవేశాలు 5వేల పైమాటే..

విశాలమైన భవన సముదాయం, ఆటల కోసం మైదా నం.. ఉచిత పుస్తకాలు, రుసుములు ఉండవు, నాణ్యమైన విద్య,నిపుణులైన అధ్యాపకులు.. విస్తృతంగా ప్రచారం చే యడంతో ఈసారి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సుమా రు 5వేలకు పైగా ప్రవేశాలు దాటే అవకాశం ఉంది. ఇంకా అడ్మిషన్లు కొనసాగుతుండగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అనుభవం అంకిభావం ఉన్న లెక్చరర్లు ఉన్నప్పటికీ, విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు లేక పాఠాలు అర్థం కావడం లేదని పిల్లలు ఆరోపిస్తున్నారు. గతేడాది అరకొరగానే అం దించగా ఈ ఏడాది పరిస్థితి మరింత దయనీయంగా మా రిందని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.


మూడు నెలలు గడుస్తున్నా..

జిల్లాలో 19 ప్రభుత్వ  జూనియర్‌ కళాశాలు, ఒక ఎయిడెడ్‌ కళాశాల, ప్రభుత్వ యాజమాన్య పరిధిలోనివి 46 కళాశాలలు, ప్రైవేటు కళాశాలలు 59 ఉన్నాయి. వాటిలో గతసంవత్సరం ప్రథమ సంవత్సరంలో 17,775 మంది విద్యార్థులు నమోదయ్యారు. అందులో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు 6,896 మంది ఉన్నారు. ప్రస్తుతం వారంతా ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని  విద్యార్థుల్లో ఎక్కువమంది పేద కుటుంబాలకు చెం దినవారే ఉంటారు. ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందిస్తే చదువుకోవడానికి  వీలుంటుంది. తరగతులు ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకపోవడంతో పరిస్థితి అగమ్మగోచరంగా మారింది. ఇప్పటికేౖనా ఉన్నతాధికారులు స్పందించి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.


పాత వాటితో సర్దుబాటు

సీనియర్‌ విద్యార్థుల వద్ద తీసుకున్న పుస్తకాలను ేసకరించి కొంతమంది విద్యార్థులకు సర్దుబాటు చేశారు. వీటితోనే అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు. పాఠాలు తిరిగీ పునశ్చరణ చేసుకుందామనుకునే వారికి తమ వద్ద పుస్తకాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.


వారంలో పాఠ్యపుస్తకాల పంపిణీ

రవిబాబు, ఇంటర్‌ విద్యాశాఖ అధికారి

జిల్లాలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తాం. దీనికి సంబంధించి హైదరాబాదు ప్రధాన కార్యాలయానికి విద్యార్థుల వివరాలను, కావాల్సిన పుస్తకాల సంఖ్యను అందచేశాం. ఈవిద్యా ఏడాది పాఠ్యపుస్తకాలు కొంతఆలస్యమైన మాట వాస్తవమే. గతేడాది మిగిలిన పాఠ్యపుస్తకాలు, స్టడీమెటీరియల్‌ను అందించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేశాం.  


ఖమ్మం జిల్లాలో కళాశాలల వివరాలు

ప్రభుత్వ కళాశాలలు: 19

ఎయిడెడ్‌ కళాశాల: 1

ప్రభుత్వ సెక్టారులోనివి: 46

ప్రైవేటు కాలేజీలు:  59

ప్రభుత్వ కళాశాల విద్యార్థులు: 6,896(గతేడాది ప్రథమ సంవత్సరం)

Read more