సొంతూళ్ల సమీపంలోనే పరీక్ష కేంద్రాలు

ABN , First Publish Date - 2022-10-11T20:47:41+05:30 IST

త్వరలో జరగనున్న సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలను విద్యార్థులు తమ సొంతూళ్లకు సమీపంలోని కళాశాలల్లో రాసుకోవచ్చని

సొంతూళ్ల సమీపంలోనే పరీక్ష కేంద్రాలు

బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు అవకాశం

14లోగా పోర్టల్‌లో పేర్ల నమోదు: జేఎన్‌టీయూ


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలను విద్యార్థులు తమ సొంతూళ్లకు సమీపంలోని కళాశాలల్లో రాసుకోవచ్చని జేఎన్‌టీయూ (హెచ్‌) డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూయేషన్‌ ప్రొఫెసర్‌ చంద్రమోహన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో చదివే బీటెక్‌, బీఫార్మసీ విద్యార్థులతోపాటు ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. పరీక్షలు రాసే విద్యార్థులు అక్టోబర్‌ 14 తేదీలోగా జేఎన్‌టీయూ స్టూడెంట్‌ పోర్టల్‌లో కళాశాల సెంటర్ల పేర్లు నమోదు చేసుకోవాలి. ఆయా విద్యార్థులు తమ స్వగ్రామాలకు సమీపంలో ఉన్న కేంద్రాల్లో, ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్షలు రాయవచ్చు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లుగా జేఎన్‌టీయూ ఈ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ ఏడాది కూడా ఇదే విధానం కొనసాగనుంది.

Read more