PNBలో 24 ప్యూన్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-02-23T20:45:46+05:30 IST

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ), హైదరాబాద్‌ సర్కిల్‌లో ఖాళీగా ఉన్న ప్యూన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

PNBలో 24 ప్యూన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ), హైదరాబాద్‌ సర్కిల్‌లో ఖాళీగా ఉన్న ప్యూన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఇంటర్‌/తత్సమాన ఉత్తీర్ణత. ఇంగ్లీష్‌లో ప్రాథమికంగా చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

వయసు: 2022 జనవరి 01 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.14,500 నుంచి రూ.28,145 + ఇతర అలవెన్సులు చెల్లిస్తారు

ఎంపిక: దరఖాస్తుల పరిశీలన తరవాత ప్రకటనలో సూచించిన అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 04

చిరునామా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సర్కిల్‌ ఆఫీస్‌, రీజెన్సీ ప్లాజా, 1వ అంతస్తు, ప్లాట్‌ నెం.3, మైత్రి విహార్‌ ఏరియా, అమీర్‌పేట్‌, హైదరాబాద్‌-5000016.

వెబ్‌సైట్‌: https://www.pnbindia.in/

Read more