హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో మేనేజర్లు, ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు

ABN , First Publish Date - 2022-09-30T21:57:55+05:30 IST

విశాఖపట్నం(Visakhapatnam)లోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(Hindustan Shipyard Ltd) (హెచ్‌ఎస్‌ఎల్‌) - మేనేజర్లు, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో మేనేజర్లు, ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు

విశాఖపట్నం(Visakhapatnam)లోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(Hindustan Shipyard Ltd) (హెచ్‌ఎస్‌ఎల్‌) - మేనేజర్లు, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో పర్మనెంట్‌, కాంట్రాక్ట్‌ పోస్టులు ఉన్నాయి. 

మొత్తం ఖాళీలు: 55

పర్మనెంట్‌ పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌(లీగల్‌) 1, మేనేజర్లు 9(టెక్నికల్‌ 7, కమర్షియల్‌ 2), డిప్యూటీ మేనేజర్లు (డిజైన్‌) 4 

కాంట్రాక్ట్‌ పోస్టులు: ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు(డిజైన్‌) 2, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు 25(టెక్నికల్‌ 10, ప్లాంట్‌ మెయింటెనెన్స్‌ 2, సివిల్‌ 4, సేఫ్టీ 1, లీగల్‌ 2, హెచ్‌ఆర్‌ 4, ఐటీ అండ్‌ ఈఆర్‌పీ 2), మెడికల్‌ ఆఫీసర్లు 4, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు 6(డిజైన్‌ 4, సివిల్‌ 2) 

అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎల్‌ఎల్‌బీ, ఎంసీఏ, సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన మేరకు అనుభవం తప్పనిసరి. పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. 

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్స్‌, ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.300(దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: పర్మనెంట్‌ పోస్టులకు అక్టోబరు 20; కాంట్రాక్ట్‌ పోస్టులకు అక్టోబరు 31

దరఖాస్తు హార్డ్‌ కాపీ చేరేందుకు చివరి తేదీ: పర్మనెంట్‌ పోస్టులకు అక్టోబరు 31; కాంట్రాక్ట్‌ పోస్టులకు నవంబరు 10

వెబ్‌సైట్‌: www.hslvizag.in

Read more