SBIలో భారీగా జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-09-17T18:21:46+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) 5008 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌ సర్కిల్‌లో 225 ఖాళీలున్నాయి.

SBIలో భారీగా జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) 5008 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌ సర్కిల్‌లో 225 ఖాళీలున్నాయి. 

పోస్టులు: జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)

సర్కిల్‌ వారీగా ఖాళీలు: అహ్మదాబాద్‌-357, బెంగళూరు-316, భోపాల్‌-481, బెంగాల్‌-376, భువనేశ్వర్‌-170, చండీగఢ్‌-225, చెన్నై-362, ఢిల్లీ-152, హైదరాబాద్‌-225, జైపూర్‌-284, కేరళ-273, లఖ్‌నవూ/ఢిల్లీ-631, మహారాష్ట్ర/ముంబయి మెట్రో-747, మహారాష్ట్ర-50, నార్త్‌ ఈస్టర్న్‌-359

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/తత్సమానత ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: 2022 ఆగస్టు 01 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలు మూడేళ్లు; పీడబ్ల్యూడీ(జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

బేసిక్‌ పే: నెలకు రూ.19,900

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 27

ప్రిలిమినరీ పరీక్ష: నవంబరు 2022

మెయిన్‌ పరీక్ష తేదీ: డిసెంబరు 2022/జనవరి 2023లో జరుగుతుంది.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/ web/careers/currentopenings

Updated Date - 2022-09-17T18:21:46+05:30 IST