BEEలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు

ABN , First Publish Date - 2022-06-11T21:54:48+05:30 IST

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

BEEలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు

మొత్తం ఖాళీలు: 11

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీ(ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/కెమికల్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.60,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: అభ్యర్థుల్ని మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 04

వెబ్‌సైట్‌: https://beeindia.gov.in/

Updated Date - 2022-06-11T21:54:48+05:30 IST