RGUKT, బాసరలో గెస్ట్‌ ఫ్యాకల్టీ

ABN , First Publish Date - 2022-03-18T17:54:14+05:30 IST

బాసర(తెలంగాణ)లోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

RGUKT, బాసరలో గెస్ట్‌ ఫ్యాకల్టీ

బాసర(తెలంగాణ)లోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఇంజనీరింగ్‌ విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక నిక్స్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జీ, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌తో పాటు ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు.

జీతభత్యాలు: నెలకు రూ.30,000 చెల్లిస్తారు

సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్: కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌. 

అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత, అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.30,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

చివరి తేదీ: మార్చి 21

వెబ్‌సైట్‌: https://www.rgukt.ac.in/

Read more