జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్స్‌ వాయిస్‌

ABN , First Publish Date - 2022-09-17T20:14:16+05:30 IST

ఆత్మవిశ్వాసం ఎన్నడూ తగ్గకూడదు. నావరకు ఆ విషయంలో చాలా జాగ్రత్తపడ్డాను. ప్రశ్నపత్రం చూడగానే అడిగిన వాటిలో నాలుగైదు కష్టంగా అనిపించవచ్చు. అంతమాత్రాన బెంబేలు పడకూడదు. ర్యాంకు తగ్గుతుందని ఆదుర్దా పడకూడదు. ఇచ్చిన వాటిలో ఒక ప్రశ్నకు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్స్‌ వాయిస్‌

ఆత్మవిశ్వాసం తగ్గకూడదు



జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్‌: 6

జేఈఈ మెయిన్‌లో ర్యాంక్‌: 17

తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంక్‌: 3

ఏపీఈఏపీసెట్‌లో ర్యాంక్‌: 24

ఇంటర్‌లో మార్కులు: 937

స్వస్థలం: గుంటూరు జిల్లా, తెనాలి మండలం, ఖాజీపేట

తండ్రి: కోటేశ్వరరావు(బిజినెస్‌)

తల్లి: కోటేశ్వరమ్మ(గృహిణి)

తమ్ముడు: నీల్‌కాంత్‌(ఎనిమిదో తరగతి)


ఆత్మవిశ్వాసం ఎన్నడూ తగ్గకూడదు. నావరకు ఆ విషయంలో చాలా జాగ్రత్తపడ్డాను. ప్రశ్నపత్రం చూడగానే అడిగిన వాటిలో నాలుగైదు కష్టంగా అనిపించవచ్చు. అంతమాత్రాన బెంబేలు పడకూడదు. ర్యాంకు తగ్గుతుందని ఆదుర్దా పడకూడదు. ఇచ్చిన వాటిలో ఒక ప్రశ్నకు సమాధానం మనకు రాలేదంటే, అలాంటి పరిస్థితి ఎంతో మందికి ఎదురై ఉంటుందని భావించాలి. ఆ కష్టం ఏదో మనకు ఒక్కరికే పరిమితం అనుకోకూడదు. అప్పుడు అసలు భయం మన దగ్గరకు చేరదు. ఆత్మవిశ్వాసం సడలదు.  పరీక్ష రాస్తున్న క్రమంలో అన్నీ అవే తెలుస్తాయి, గుర్తుకొస్తాయి. 



అలాగే అన్నీ రాసేయాలన్న ఆకాంక్ష కూడా ఉండకూడదు. పరీక్ష రాస్తున్న మూడు గంటల సమయంలో మొదటి నిమిషం మొదలుకుని చివరి వరకు అంటే జవాబు పత్రం ఇచ్చేవరకు లేదంటే సబ్మిట్‌ బటన్‌ కొట్టేవరకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇది నేను బాగా నమ్మిన సత్యం.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మిగతా పరీక్షల మాదిరిగా ఉండదు. ఒకే ప్రశ్నలో మల్టిపుల్‌ కాన్సెప్టులను కలిపి అడుగుతారు. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రాబ్లెమ్స్‌ను సాల్వ్‌ చేసుకుంటూ వెళ్ళాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అడిగే ప్రశ్నలకు కూడా వేర్వేరు మార్కులు ఉంటాయి. టైమ్‌ మేనేజ్‌మెంట్‌లో ఈ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అన్నింటికీ మించి ప్రశ్నను చదివి అర్థం చేసుకోవడంలో, కాలిక్యులేషన్స్‌ విషయంలో ఎక్కువ తప్పులు దొర్లుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ వెళితే చాలు, మన లక్ష్యానికి దగ్గరకు వెళ్ళగలుగుతామని నేను నమ్ముతాను. రివిజన్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరంభంలో కెమిస్ట్రీలో వీక్‌. అయితే  టీచింగ్‌తో కలిపి


రోజుకు పద్నాలుగు గంటలు కాగా కెమిస్ట్రీకి ఆరు గంటలు కేటాయించుకునేవాడిని. కెమిస్ట్రీలో మూడు భాగాలు. ఫిజికల్‌ కెమిస్ట్రీపై పట్టుకోసం కాన్సె్‌ప్టపై క్లారిటీ సాధించి ప్రాక్టీ్‌సపై దృష్టిపెట్టేవాడిని. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కోసం మెకానిజం ఆధారంగా రియాక్షన్స్‌ను అర్థం చేసుకునేవాడిని. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ కోసం బాగా చదివే వాడిని. అదే మేథ్స్‌, ఫిజిక్స్‌ విషయానికి వస్తే కాన్సెప్ట్‌ క్లారిటీ ఆపై ప్రాక్టీ్‌సకు ప్రాధాన్యం ఇచ్చేవాడిని. ఇంటర్నల్‌ టెస్టుల్లో మార్కులు తగ్గితే తప్పు ఎక్కడ దొర్లింది చూసుకుని అది మళ్ళీ జరగకుండా చూసుకునేవాడిని. అందుకు కాన్సెప్ట్‌ సహా అంతా మొదటి నుంచి నేర్చుకునేవాడిని. ఏ రోజైనా ఒక సబ్జెక్టులో నాలుగు టాపిక్స్‌ లేదంటే కాన్సెప్ట్స్‌ నేర్చుకోవాలంటే సులువుతో మొదలుపెట్టే వాడిని.  కష్టంగా ఉన్నవాటిని చివర్లో ఉంచుకుని, ఎక్కువ సమయం అందుకోసం వెచ్చించేవాడిని. బాగా ఒత్తిడి అనిపించినప్పుడు అమ్మ, నాన్నతో మాట్లాడే వాడిని. నాకు క్రికెట్‌ తప్ప ఏ ఆటైనా ఇష్టమే. రీసెర్చ్‌ నా గోల్‌. ఆ దిశగానే నా కెరీర్‌ను తీర్చిదిద్దుకోదలిచాను. 


ఒత్తిడి లేకపోవడం నా అదృష్టం


ధీరజ్‌ కురుకుండ

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్‌: 8

జేఈఈ మెయిన్‌లో ర్యాంక్‌: 4

ఇంటర్‌లో మార్కులు: 988

స్వస్థలం: కర్నూలు

తండ్రి: రమేష్‌ (బ్యాంక్‌ ఉద్యోగి)

తల్లి: ఉమాదేవి(గృహిణి)

అక్క: భార్గవి(హైదరాబాద్‌ ఐఐఐటీలో బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) మూడో ఏడాది చదువుతోంది)


నేను చాలా అదృష్టవంతుడిని. నాపై ఎన్నడూ ఒత్తిడి లేదు. నాకు పాఠాలు చెప్పిన టీచర్లు కూడా ఎన్నడూ ఒత్తిడి పెట్టేవారు కాదు. మార్కులు తగ్గినప్పుడు అందుకు కారణం ఏమిటో చెప్పేవారు. జాగ్రత్తగా ఉండాలని మాత్రం హెచ్చరించేవారు. మళ్ళీ సారి మంచి మార్కులు వస్తాయంటూ ప్రోత్సహించేవారు. 


అన్నింటికంటే మించి మా జావేద్‌ సార్‌. కెమిస్ట్రీలో కంఠతా పట్టాల్సినవి కూడా సులువుగా నేర్చుకోవచ్చని చెప్పేవారు. దాంతో నిజానికి కంఠతా పట్టాల్సినవి నాకు బాగా తగ్గాయి. ఆ రకంగా నేను ప్రయోజనం పొందాను. రోజూ ప్రతి సబ్జెక్టుకు నాలుగు గంటలు కేటాయించుకునేవాడిని. ముఖ్యంగా నాకు వీకెండ్స్‌లో చేసే రివిజన్‌ చాలా హెల్ప్‌ అయింది. అది కూడా మా టీచర్లు చెప్పిన సులువు సూత్రమే. మొదటి ఆరు నెలల్లో సిలబస్‌ కంప్లీట్‌ చేసేవారు. తరవాత నుంచి పరీక్షలపై ఫోకస్‌ ఉండేది. సబ్జెక్టు ఏదైనా కాన్సె్‌ప్టను ఆకళింపు చేసుకుంటే, ప్రాబ్లెమ్‌ ఎలా వచ్చినా ఇబ్బంది అనిపించదు. అలా కాకుండా కాన్సెప్ట్‌ క్లియర్‌ కాకుంటేనే కష్టాలు ఆరంభమవుతాయన్నది నా నమ్మకం. అలాగే ఇంటర్‌ పరీక్షలు, మెయిన్‌తో పోల్చుకుంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ భిన్నంగా ఉంటుందన్న సత్యాన్ని మొదట గ్రహించాలి.  ఆ విషయంపై మొదటి నుంచి అవగాహన ఉన్న ఎవరైనా సరే, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అంతగా ఇబ్బంది పడరు. ర్యాంక్‌ రాకపోవచ్చేమో కాని, ఏమీ సాధించకుండా ఉండలేరని అనుకుంటున్నాను. 


మాది కర్నూలు అయినప్పటికీ నాన్న ఉద్యోగి కావడంతో నాలుగో తరగతి నుంచి హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. చివరగా ఆంత్రప్రెన్యూర్‌ కావాలన్నది నా ఆకాంక్ష. 



Updated Date - 2022-09-17T20:14:16+05:30 IST