Under graduate ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌

ABN , First Publish Date - 2022-06-11T20:32:33+05:30 IST

ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏఐఎంఏ) - అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(యూజీఏటీ) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, బీబీఏ, బీహెచ్‌ఎం, బీసీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ద్వితీయ శ్రేణి..

Under graduate ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌

ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏఐఎంఏ) - అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(యూజీఏటీ) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, బీబీఏ, బీహెచ్‌ఎం, బీసీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

యూజీఏటీ 2022 వివరాలు: దీనిని పీబీటీ(పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 40, న్యూమరికల్‌ అండ్‌ డేటా అనాలిసిస్‌ నుంచి 30, రీజనింగ్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి 30, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. బీహెచ్‌ఎం కోర్సుకు నిర్వహించే ఎగ్జామ్‌లో మాత్రం పైవాటితోపాటు సర్వీస్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25, సైంటిఫిక్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. వీటికి అదనంగా గంట సమయం ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉన్నాయి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.750

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్‌ 17

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: జూన్‌ 20 నుంచి

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌

యూజీఏటీ 2022 తేదీ: జూన్‌ 25 

వెబ్‌సైట్‌: https://apps.aima.in/ugat2022

Updated Date - 2022-06-11T20:32:33+05:30 IST