నిమ్స్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ కోర్సులు.. స్టయిపెండ్‌ సౌకర్యం మాత్రం..!

ABN , First Publish Date - 2022-01-03T18:33:15+05:30 IST

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) - పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పలు మెడికల్‌ విభాగాల్లో ఏడాది, ఆర్నెల్ల వ్యవధిగల కోర్సులు ఉన్నాయి

నిమ్స్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ కోర్సులు.. స్టయిపెండ్‌ సౌకర్యం మాత్రం..!

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) - పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పలు మెడికల్‌ విభాగాల్లో ఏడాది, ఆర్నెల్ల వ్యవధిగల కోర్సులు ఉన్నాయి. ఇవి ఫుల్‌ టైం కోర్సులు. సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌/ డీఆర్‌ఎన్‌బీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠంగా రెండు కోర్సులు ఎంచుకొనే వీలుంది. ప్రతి కోర్సుకూ విడిగా దరఖాస్తు చేసుకోవాలి.  ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్థులను ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ లేదా కన్సల్టేషన్స్‌కు అనుమతించరు. ఏ ఇతర డిగ్రీ/ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి రిజిస్టర్‌ చేసుకోకూడదు. స్టయిపెండ్‌ సౌకర్యం లేదు.


ఏడాది కోర్సులు - సీట్లు

న్యూరో అనెస్తీషియా, అంకో అనెస్తీషియా, కార్డియోథొరాసిక్‌ అనెస్తీషియా, క్రిటికల్‌ కేర్‌, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ, హెమటో పాథాలజీ, అంకో పాథాలజీ, హెపటో - పాంక్రియాటో బిలియరీ సర్జరీ, గైనకాలజికల్‌ సర్జికల్‌ అంకాలజీ, హెడ్‌ అండ్‌ నెక్‌ అంకోసర్జరీ, అంకలాజికల్‌ బ్రెస్ట్‌ సర్జరీ అండ్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోర్సుల్లో ఒక్కోదానిలో 2 సీట్లు ఉన్నాయి. మూమెంట్‌ డిజార్డర్స్‌, ఎపిలెప్సీ, న్యూరో సర్జరీ ఫర్‌ మూమెంట్‌ డిజార్డర్స్‌, ఎపిలెప్సీ సర్జరీ, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌, స్పైన్‌ కరెక్షన్‌, ఆర్థోపెడిక్‌ అంకాలజీ, న్యూరో పాథాలజీ, న్యూరో రేడియాలజీ, అంకో ఇమేజింగ్‌, మస్క్యులోస్కెలిటల్‌ రేడియాలజీ, థొరాసిక్‌ అండ్‌ కార్డియాక్‌ రేడియాలజీ కోర్సుల్లో ఒక్కోదానిలో ఒక సీటు ఉంది.


ఆర్నెల్ల కోర్సులు - సీట్లు
క్లినికల్‌ ఫార్మకాలజీ, ఎమర్జెన్సీ అండ్‌ ట్రామా, మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ అండ్‌ జినోమిక్స్‌, పేరెంటల్‌ జెనెటిక్స్‌ కోర్సుల్లో ఒక్కోదానిలో 2 సీట్లు ఉన్నాయి. రుమటలాజిక్‌ ఎమర్జెన్సీస్‌, పీడియాట్రిక్‌ రుమటాలజీ అండ్‌ ఇమ్యూనాలజీ, ప్లాస్టిక్‌ అండ్‌ రీ కన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ కోర్సుల్లో ఒక్కోదానిలో 1 సీటు ఉంది.  

ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.1500
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 15
వెబ్‌సైట్‌:  www.nims.edu.in

Read more