NIPERలో డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

ABN , First Publish Date - 2022-02-19T19:45:26+05:30 IST

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) - ఫార్మాస్యూటికల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (టీఎస్‌సీఎస్‌టీ), కేంద్ర ప్రభుత్వ..

NIPERలో డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) - ఫార్మాస్యూటికల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (టీఎస్‌సీఎస్‌టీ), కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం ఉమ్మడిగా సహకారం అందిస్తున్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి ఆర్నెల్లు. ఇది ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. మొత్తం 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అకడమిక్‌ ప్రతిభ, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, బిజినెస్‌ ఐడియా ప్లాన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000ల స్టయిపెండ్‌ ఇస్తారు.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ/ ఎంఫార్మసీ/ పీహెచ్‌డీ(ఫార్మసీ)/ ఫార్మసీ సంబంధిత ఇతర కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ప్రస్తుతం ఏ ఇతర ఫుల్‌ టైం కోర్సులు చేస్తూ ఉండకూడదు. ఫార్మా విభాగాలకు సంబంధించి బిజినెస్‌ ఐడియాను తెలుపుతూ పూర్తి వివరణతో పేపర్స్‌ సబ్మిట్‌ చేయాలి. మొదటి దశలో ఎంపికైన అభ్యర్థులు సెలెక్షన్‌ ప్యానెల్‌ ఎదుట తమ బిజినెస్‌ ఐడియాకు సంబంధించి ప్రజంటేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.  


ముఖ్య సమాచారం

ఈ- మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28

ఈ - మెయిల్‌: edp.niperhyd@gmail.com

వెబ్‌సైట్‌: niperhyd.ac.in

Updated Date - 2022-02-19T19:45:26+05:30 IST