ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా

ABN , First Publish Date - 2022-09-17T20:43:30+05:30 IST

ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ ఆర్గనైజేషన్‌(Environmental Planning and Coordination Organization) (ఎప్కో) ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌ - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఈఎం) ప్రోగ్రామ్‌లో

ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా

ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ ఆర్గనైజేషన్‌(Environmental Planning and Coordination Organization) (ఎప్కో) ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌ - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఈఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎన్విరాన్‌మెంట్‌, సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌, క్లయిమేట్‌ చేంజ్‌ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రామ్‌ను ఉద్దేశించారు. ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇందులో 40 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా క్లాస్‌ రూం సెషన్స్‌, సెల్ఫ్‌ లెర్నింగ్‌, మెంటారింగ్‌, ఫీల్డ్‌ విజిట్స్‌, అసైన్‌మెంట్స్‌, డిజర్టేషన్‌/ ప్రాజెక్ట్‌ వర్క్‌, టర్మ్‌ ఎండ్‌ ఎగ్జామ్స్‌ ఉంటాయి. క్లాస్‌ రూం స్టడీకి 150 గంటలు నిర్దేశించారు. కనీసం 80 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి. స్ర్కీనింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్‌ కమిటీ నిర్ణయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెషర్స్‌, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు 50 శాతం మార్కులు చాలు. డిసెంబరు 31 నాటికి అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు. 


ప్రోగ్రామ్‌ ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.27,500; రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు రూ.16,500 

ఫీజు: రూ.1000

చివరి తేదీ: సెప్టెంబరు 15

వెబ్‌సైట్‌: www.epco.mp.gov.in

Read more