Nit‌ Tiruchirappalliలో ఎంటెక్‌, ఎంఆర్క్‌

ABN , First Publish Date - 2022-06-11T20:55:02+05:30 IST

తిరుచిరాపల్లిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) - స్పాన్సర్డ్‌ కేటగిరీ కింద ఎంటెక్‌, ఎంఆర్క్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. రిటెన్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తారు.

Nit‌ Tiruchirappalliలో ఎంటెక్‌, ఎంఆర్క్‌

తిరుచిరాపల్లిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) - స్పాన్సర్డ్‌ కేటగిరీ కింద ఎంటెక్‌, ఎంఆర్క్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. రిటెన్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తారు. 

ఎంటెక్‌ విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, డేటా అనలిటిక్స్‌, ఎనర్జీ ఇంజనీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌, జియోటెక్నికల్‌ ఇంజనీరింగ్‌, ఇండస్ట్రియల్‌  ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రియల్‌ మెటలర్జీ, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ఆటొమేషన్‌, మాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజీ, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌, థర్మల్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, వీఎల్‌ఎ్‌సఐ సిస్టం, వెల్డింగ్‌ ఇంజనీరింగ్‌.

ఎంఆర్క్‌ విభాగం: ఎనర్జీ ఎఫిషియెంట్‌ అండ్‌ సస్టయినబుల్‌ ఆర్కిటెక్చర్‌

అర్హత వివరాలు: ప్రోగ్రామ్‌ను అనుసరించి ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌ ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల ప్రొఫెషనల్‌ అనుభవం ఉండాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ మార్కుల పత్రాలు; టీసీ; గేట్‌ స్కోర్‌ కార్డ్‌; స్పాన్సర్‌షిప్‌ సర్టిఫికెట్‌; కులం, ఆదాయం, వైకల్యం ధ్రువీకరణ పత్రాలు

రిటెన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు: జూలై 15న

వెబ్‌సైట్‌: www.nitt.edu

Updated Date - 2022-06-11T20:55:02+05:30 IST