Kalyani IIITలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2022-06-11T22:18:41+05:30 IST

కల్యాణి (పశ్చిమ బెంగాల్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. గుర్తింపు పొందిన ఫండింగ్‌ ఏజెన్సీల నుంచి ఫెలోషిప్‌ పొందినవారు రిసెర్చ్‌ ఫెలో కేటగిరీలో; ప్రముఖ పరిశోధన/ బోధన సంస్థలు స్పాన్సర్‌ చేసిన..

Kalyani IIITలో పీహెచ్‌డీ

కల్యాణి (పశ్చిమ బెంగాల్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. గుర్తింపు పొందిన ఫండింగ్‌ ఏజెన్సీల నుంచి ఫెలోషిప్‌ పొందినవారు రిసెర్చ్‌ ఫెలో కేటగిరీలో; ప్రముఖ పరిశోధన/ బోధన సంస్థలు స్పాన్సర్‌ చేసిన అభ్యర్థులు ఫుల్‌ టైం స్పాన్సర్డ్‌ కేటగిరీలో; పరిశోధన సంస్థలు/ పారిశ్రామిక సంస్థలు/ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు ఎక్స్‌టర్నల్‌ కేటగిరీలో; ఐఐఐటీ కల్యాణీ సహా ప్రముఖ సంస్థల్లో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు పార్ట్‌ టైం కేటగిరీలో; సంస్థ స్పాన్సర్‌ చేసిన ప్రాజెక్ట్‌ వర్క్‌ చేస్తున్నవారు ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు. 


స్పెషలైజేషన్‌లు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ (స్పేస్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌).

అర్హత: ఇంజనీరింగ్‌ విభాగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 70 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ పూర్తిచేసి గేట్‌/ నెట్‌ అర్హత పొందినవారు కూడా అర్హులే. సైన్స్‌ విభాగాలకు సంబంధిత స్పెషలైజేషన్‌తో కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌/ నెట్‌ అర్హత తప్పనిసరి.

ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి రిటెన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.500; ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 21

రిటెన్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: జూన్‌ 29

ఇంటర్వ్యూలు: జూలై 4 నుంచి 14 మధ్య

వెబ్‌సైట్‌: iiitkalyani.ac.in

Updated Date - 2022-06-11T22:18:41+05:30 IST