Kakinada JNTUలో ఎంబీఏ(సీఎంయూ)

ABN , First Publish Date - 2022-09-10T21:10:46+05:30 IST

కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(Jawaharlal Nehru Technological University)(జేఎన్‌టీయూకే) - యూఎస్‌ఏలోని సెంట్రల్‌ మిచిగన్‌ యూనివర్సిటీ సహకారంతో ఎంబీఏ ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇందులో 18 సీట్లు ఉన్నాయి

Kakinada JNTUలో ఎంబీఏ(సీఎంయూ)

కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(Jawaharlal Nehru Technological University)(జేఎన్‌టీయూకే) - యూఎస్‌ఏలోని సెంట్రల్‌ మిచిగన్‌ యూనివర్సిటీ సహకారంతో ఎంబీఏ ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇందులో 18 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. మొదటి ఏడాది కాకినాడ జేఎన్‌టీయూలో, రెండో ఏడాది యూఎస్‌ఏలోని సీఎంయూలో చదవాల్సి ఉంటుంది. ఐసెట్‌ 2022 ర్యాంక్‌, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. స్కాలర్‌షి‌ప్‌లు, స్టయిపెండ్‌ ఉండవు.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో నాలుగేళ్ల ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసెట్‌ 2022 అర్హత పొంది ఉండాలి.


ముఖ్య సమాచారం

ప్రోగ్రామ్‌ ఫీజు: మొదటి ఏడాది రూ.1,50,000; రెండో ఏడాది 12000ల యూఎస్‌ డాలర్లు

దరఖాస్తు ఫీజు: రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 10

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి నుంచి డిగ్రీ వరకు సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; ఐసెట్‌ 2022 ర్యాంక్‌ కార్డ్‌

వెబ్‌సైట్‌: www.jntuk.edu.in

Updated Date - 2022-09-10T21:10:46+05:30 IST