JNAFAUలో బీఆర్క్‌

ABN , First Publish Date - 2022-09-10T21:31:09+05:30 IST

హైదరాబాద్‌, మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(Jawaharlal Nehru Architecture and Fine Arts University) (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) సహా అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌

JNAFAUలో బీఆర్క్‌

హైదరాబాద్‌, మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌  ఆర్ట్స్‌ యూనివర్సిటీ(Jawaharlal Nehru Architecture and Fine Arts University) (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) సహా అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌, మైనారిటీ, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్లు. ఐఐటీ జేఈఈ మెయిన్‌ 2022 పేపర్‌ 2 ఏ (బీఆర్క్‌)  లేదా నాటా 2022 స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు.  


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. ఐఐటీ జేఈఈ మెయిన్‌ 2022 పేపర్‌ 2 ఏ(బీఆర్క్‌)  లేదా నాటా 2022 అర్హత తప్పనిసరి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: ఆగస్టు 29 నుంచి 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 7

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌: సెప్టెంబరు 8 నుంచి 20 వరకు

వెబ్‌ ఆప్షన్స్‌: సెప్టెంబరు 24, 25

మొదటి విడతలో అడ్మిషన్స్‌ పొందిన అభ్యర్థుల జాబితా విడుదల: సెప్టెంబరు 27

రెండో విడత కౌన్సెలింగ్‌: అక్టోబరు 1, 2

రెండో విడతలో అడ్మిషన్స్‌ పొందిన అభ్యర్థుల జాబితా విడుదల: అక్టోబరు 10, 11

స్పాట్‌ అడ్మిషన్స్‌ ప్రకటన: అక్టోబరు 11న

వెబ్‌సైట్‌: www.jnafau.ac.in

Updated Date - 2022-09-10T21:31:09+05:30 IST