నా స్కోరు సరిపోతుందా?
ABN , First Publish Date - 2022-06-07T23:42:16+05:30 IST
నేను ఈసీఈతో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాను. నాకు వర్క్ ఎక్స్పీరియన్స్లేదు, ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్లేదు. సీజీపీఏ కూడా తక్కువగా ఉంది. విదేశీ యూనివర్సిటీల్లో ఎంఎస్ చేయాలనే ఆలోచన ఉంది. అయితే ఆర్థికంగా పెద్దగా ఖర్చుపెట్టగలిగే కుటుంబం కాదు...

నేను ఈసీఈతో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాను. నాకు వర్క్ ఎక్స్పీరియన్స్లేదు, ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్లేదు. సీజీపీఏ కూడా తక్కువగా ఉంది. విదేశీ యూనివర్సిటీల్లో ఎంఎస్ చేయాలనే ఆలోచన ఉంది. అయితే ఆర్థికంగా పెద్దగా ఖర్చుపెట్టగలిగే కుటుంబం కాదు. ఇవన్నీ నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. విదేశీ యూనివర్సిటీల్లో చేరేందుకు నా స్కోరు సరిపోతుందా? సలహా ఇవ్వగలరు?
- నవీన్, సికింద్రాబాద్
మొదట మీరు ఆత్మన్యూనత నుంచి బయట పడండి. ప్రతీ వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మీ బలాలతో మంచి రెజ్యుమెను తయారు చేసుకోండి. ఫీజులు చెల్లించే భారత విద్యార్థులకు చాలా అమెరికన్ యూనివర్సిటీలు సీట్లు ఇస్తాయి. మన దగ్గర ఉన్న ప్రతీ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటి స్థాయిలో లేనట్లే, అమెరికాలోని ప్రతీ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ లేదా మసాచుసెట్స్ ఏమీ కావు. అందుకని దిగులు పడకండి. ఇప్పటికీ కూడా ఏమీ సమయం వృథా కాలేదు. ఇంటర్న్షి్పలేదా మంచి ప్రాజెక్ట్ చేయండి. మీ సబ్జెక్ట్ చాయిస్, మీ స్పెషలైజేషన్ ఏరియా, కెరీర్ గోల్స్ తదితరాలతో పర్సనల్ స్టేట్మెంట్ తయారు చేసుకోండి. జీఆర్ఈ, టోఫెల్ ఐబీటీపరీక్ష రాయండి. ఈ పరీక్షల రిజిస్ట్రేషన్ కోసం ఠీఠీఠీ.్ఛ్టట.ౌటజ సైట్ చూడండి. స్కాలర్షిప్ కావాలంటే జీఆర్ఈలో మంచి స్కోరు ఉండాలి.