IRMAలో పీజీడీఎం (ఆర్‌ఎం - ఎగ్జిక్యూటివ్‌)

ABN , First Publish Date - 2022-09-21T22:48:20+05:30 IST

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌(Institute of Rural Management Anand)(ఐఆర్‌ఎంఏ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనిలో ప్రధాన స్పెషలైజేషన్‌ రూరల్‌

IRMAలో పీజీడీఎం (ఆర్‌ఎం - ఎగ్జిక్యూటివ్‌)

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌(Institute of Rural Management Anand)(ఐఆర్‌ఎంఏ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనిలో ప్రధాన స్పెషలైజేషన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌. దీనిని వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రత్యేకించారు. ఇది 15 నెలల వ్యవధి గల ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. దీనిని ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌నకు సమానంగా పరిగణిస్తారు. దీనికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.  


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. క్యాట్‌ (2020/ 2021/ 2022)/ ఎక్స్‌ఏటీ (2021/ 2022/ 2023)/ జీమాట్‌ (2021 జనవరి 1 నుంచి 2023 జనవరి 15 మధ్య) స్కోర్‌ ఉండాలి. మేనేజర్‌/ సూపర్‌వైజర్‌ స్థాయిలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.   

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, జాతీయ పరీక్ష స్కోర్‌, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జాతీయ పరీక్ష స్కోర్‌నకు 35 శాతం, అకడమిక్‌ ప్రతిభకు 10 శాతం, అనుభవానికి 5 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 40 శాతం, స్పోర్ట్స్‌ సంబంధిత విజయాలకు 5 శాతం, జెండర్‌ డైవర్సిటీకి 5 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.2500

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: 2023 జనవరి 27

పర్సనల్‌ ఇంటర్వ్యూలు: 2023 ఫిబ్రవరి 10

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 2023 ఫిబ్రవరి 24

మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 2023 మార్చి 24

ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌: 2023 మే 22 నుంచి 26 వరకు

తరగతులు ప్రారంభం: 2023 మే 29 నుంచి

వెబ్‌సైట్‌: irma.ac.in

Read more