FCRIలో బీఎస్సీ ఆనర్స్‌ ఫారెస్ట్రీ

ABN , First Publish Date - 2022-09-17T21:01:24+05:30 IST

సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(Forest College and Research Institute) (ఎఫ్‌సీఆర్‌ఐ) హైదరాబాద్‌ - బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీ ప్రోగ్రామ్‌లో

FCRIలో బీఎస్సీ ఆనర్స్‌ ఫారెస్ట్రీ

సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(Forest College and Research Institute) (ఎఫ్‌సీఆర్‌ఐ) హైదరాబాద్‌ - బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీకి ఇది అనుబంధ సంస్థ. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్‌ ఎంసెట్‌ 2022 ర్యాంక్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. 

ప్రోగ్రామ్‌ వివరాలు: ఐకార్‌ నిబంధనల ప్రకారం ఈ కోర్సును రూపొందించారు. ఇందులో భాగంగా రూరల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అవేర్‌నెస్‌ డెవలప్‌మెంట్‌ యోజన ప్రోగ్రామ్‌ ఉంటుంది. దీనితోపాటు ఫారెస్ట్‌, శాంచురీస్‌, నేషనల్‌ పార్క్‌, జూ, ఎకో సిస్టమ్స్‌, ఫారెస్ట్‌ బేస్డ్‌ ఇండస్ట్రీ తదితరాల విజిట్స్‌; స్టడీ టూర్స్‌ ఉంటాయి. మొదటి రెండు సెమిస్టర్లలో ఫారెస్ట్రీకి సంబంధించి బేసిక్‌, ఫండమెంటల్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. మూడు, నాలుగు సెమిస్టర్లలో ఫారెస్ట్రీ ప్రిన్సిపల్స్‌; అయిదు, ఆరు సెమిస్టర్లలో ప్రొడక్షన్‌ సిస్టం; ఏడు, ఎనిమిది సెమిస్టర్లలో స్కిల్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ విధానాలు ఉంటాయి. ఎనిమిదో సెమిస్టర్‌లో పది వారాల ప్రాజెక్ట్‌ వర్క్‌, డిజర్టేషన్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్‌ మొత్తానికి 180 క్రెడిట్స్‌ నిర్దేశించారు.  

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్‌ అభ్యర్థులకు 45 శాతం; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. టీఎస్‌ ఎంసెట్‌ (బైపీసీ స్ట్రీం) 2022 అర్హత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్లు; దివ్యాంగులకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1800; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 24

మెరిట్‌ జాబితా విడుదల: సెప్టెంబరు 28

ఫస్ట్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌: అక్టోబరు 1న

అడ్మిషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబరు 4 

సెకండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌: అక్టోబరు 10న

ప్రోగ్రామ్‌ ప్రారంభం: అక్టోబరు 12న

వెబ్‌సైట్‌: www.fcrits.in

Updated Date - 2022-09-17T21:01:24+05:30 IST